ముంబయిలో వీధుల్లో మీడియా కంటపడింది రాఖీ. తన ప్రియుడు ఆదిల్‌ ఖాన్‌ దుర్రానీతో కలిసి కెమెరాకి చిక్కింది.  అది చూసిన రాఖీ `లైగర్‌` పాటకి స్టెప్పులేసింది. 

బాలీవుడ్‌ హాట్‌ బాంబ్‌ రాఖీ సావంత్‌ రెచ్చిపోయింది. `లైగర్‌` పాటకి స్టెప్పులేసింది. విజయ్‌ దేవరకొండ నటించిన `లైగర్‌` చిత్రంలోని `ఆఫత్‌` పాటకి అదిరిపోయేటి స్టెప్పులేయడం విశేషం. ముంబయిలో వీధుల్లో మీడియా కంటపడింది రాఖీ. తన ప్రియుడు ఆదిల్‌ ఖాన్‌ దుర్రానీతో కలిసి కెమెరాకి చిక్కింది. అది చూసిన రాఖీ `లైగర్‌` పాటకి స్టెప్పులేసింది. `ఆఫత్‌` అంటూ సాంగే పాటకి డాన్సు చేస్తూ రచ్చ చేసింది. 

తనతోపాటు ప్రియుడు ఆదిల్‌ని కూడా డాన్సు చేయమని కోరగా, ఆయన ప్రాక్టిస్‌ చేసి రేపు చేస్తానని బదులివ్వడం నవ్వులు పూయించింది. కాసేపు రాఖీ చేసిన హంగామా ఆద్యంతం ఆకట్టుకుంది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతుంది. ఇందులో పొట్టి గౌనులో కనిపిస్తుంది రాఖీ సావంత్‌. థైస్‌ అందాలనుచూపిస్తూ, లెగ్స్ షేక్‌ చేస్తూ కుర్రాళ్ల బాడీలో హీటు పుట్టించిందని చెప్పొచ్చు. ఇందులో రాఖీ సావంత్‌ చేసిన అల్లరి కూడా ఆద్యంతం నవ్వులు పూయించింది. కొందరు `జలక్‌ దిక్‌లాజా` పాటకి డాన్సు చేయండని కోరడం విశేషం. 

View post on Instagram

రాఖీ సావంత్‌ బాలీవుడ్‌ హాట్‌ బాంబ్‌గా రాణిస్తున్న విషయం తెలిసిందే. బోల్డ్ నెస్‌కి కేరాఫ్‌గా నిలుస్తుంది. ఆమె ఆ మధ్య బిగ్‌ బాస్‌ (14)షోలోనూ పాల్గొంది. అందులో తన వ్యక్తిగత విషయాలను బయటపెట్టి సంచలనాలకు తెరలేపింది. తన పెళ్లి, లవ్‌ వ్యవహారాలు సంచలనంగా మారాయి. బాలీవుడ్‌లో శృంగార తారగా రాణిస్తున్న ఈ భామ డాన్సులతో బాగా పాపులర్‌ అయ్యింది. బాలీవుడ్‌ సినిమాల్లో ఐటెమ్‌ నెంబర్స్ చేసి షేక్‌ చేస్తుంది.

 తెలుగులో నితిన్‌, ప్రియమణి కలిసి నటించిన `ద్రోణ` చిత్రంలో `సయ్యా రేసయ్యా` పాటకి స్టెప్పులేసి టాలీవుడ్‌ని ఊపేసింది. అదే సమయంలో పలు వివాదాస్పద కామెంట్లతోనూ వార్తల్లో నిలుస్తుంది. 2019లో రాఖీ ఎన్‌ ఆర్‌ ఐ రితేష్‌ని మ్యారేజ్‌ చేసుకుంది. కానీఈ ఏడాది ప్రారంభంలో ఆయనతో విడిపోయింది. ప్రస్తుతం ఆదిల్‌ దుర్రానీతో రిలేషన్‌షిప్‌లో ఉంది. విజయ్‌ దేవరకొండ, అనన్యపాండే కలిసి నటించిన `లైగర్‌` చిత్రం ఆగస్ట్ 25న విడుదలైన విషయం తెలిసిందే. పూరీ జగన్నాథ్‌ దర్శకత్వం వహించిన ఈ చిత్రం డిజాస్టర్‌ టాక్‌ని తెచ్చుకుంది.