ఇండస్ట్రీలో ఎవరూ అత్యాచారం చేయరు.. అంగీకారంతోనే అన్నీ: రాఖీ సావంత్

Rakhi sawant comments on casting couch
Highlights

ఇండస్ట్రీలో ఎవరూ అత్యాచారం చేయరు.. అంగీకారంతోనే అన్నీ

సినీ పరిశ్రమలో క్యాస్టింగ్ కౌచ్ ఉందని బాలీవుడ్ నటి రాఖీ సావంత్ తెలిపింది. ఇండస్ట్రీలో ఉన్న లైంగిక దోపిడీ తనకు తొలి నాళ్లలో ఆందోళనను కలిగించిందని... అయితే, ఆ తర్వాత తన ప్రతిభతో వాటిని అధిగమించానని చెప్పింది. అయితే సినీ పరిశ్రమలో ఎవరిపైనా అత్యాచారాలు చేయరని, పరస్పర ఆమోదంతోనే ఇది జరుగుతుందని తెలిపింది. 

అవకాశాల కోసం యువతులు ఏదైనా చేయడానికి సిద్ధంగా ఉన్నారని... క్యాస్టింగ్ కౌచ్ కు ప్రొడ్యూసర్లను తప్పుపట్టడం సరికాదని చెప్పింది. కెరియర్ కోసం అమ్మాయిలు రాజీ పడుతున్నారని... హీరోయిన్స్ అవుదామని ఇండస్ట్రీకి వచ్చిన అమ్మాయిలు మరేదో అవుతున్నారని తెలిపింది. ఫ్యాషన్ రంగంలో లైంగిక రాజీలకు యువకులకు కూడా మినహాయింపు ఉండదని చెప్పింది.

అవకాశాల కోసం రాజీపడకూడదని... ప్రతిభతో సమస్యలను అధిగమించాలని రాఖీ సూచించింది. సల్మాన్ ఖాన్, ప్రియాంక చోప్రాలు ప్రతిభతోనే రాణించారని చెప్పింది. విజయానికి షార్ట్ కట్ లు ఉండవని తెలిపింది. 

loader