శ్రీ రంజిత్ మూవీస్ బ్యానర్ పై ఎల్. దామోదర్ ప్రసాద్ ''ఫాదర్ - చిట్టి - ఉమ - కార్తీక్'' అనే చిత్రాన్ని రూపొందిస్తున్న సంగతి తెలిసిందే. రొమాంటిక్ కామెడీ ఎంటర్ టైనర్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రానికి విద్యాసాగర్ రాజు దర్శకత్వం వహించారు. ఇందులో జగపతి బాబు - రామ్ కార్తీక్ - అమ్ము అభిరామి - బాల నటి సహశ్రిత ప్రధాన పాత్రలు పోషించారు. రీసెంట్ గా ఈ సినిమ‌కు సంబంధించి ఫాద‌ర్‌-చిట్టి-ఉమా-కార్తీక్ పాత్ర‌ల‌ను రివీల్ చేస్తూ వ‌చ్చిన మేక‌ర్స్ ఇప్పుడు టీజ‌ర్‌ని రాజ‌మౌళి చేత రిలీజ్ చేయించారు. ఇంట్రస్టింగ్ గా ఉన్న ఆ టీజర్ ని మీరు ఇక్కడ చూడవ్చచు.

ఈ టీజర్ చూస్తూంటే ప్రధానంగా నాలుగు పాత్ర‌ల చుట్టూ తిరిగే క‌థాంశం అని తెలుస్తుంది. అమ్మాయిల‌ని ప‌డేసే పాత్ర‌ల‌లో జ‌గ‌ప‌తి బాబు, ఆయనకు తగ్గ కొడుకుగా రామ్ కార్తీక్  న‌టిస్తున్నారు.  ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటోంది.ఈ నెల‌లో  చిత్రాన్ని ప్రేక్ష‌కుల ముందుకు తెచ్చే ప్ర‌య‌త్నం చేస్తున్నారు.

 ఈ చిత్రానికి భీమ్స్ సిసిరోలియో సంగీతం సమకూరుస్తుండగా శివ.జి ఛాయాగ్రహణం అందించారు. కిషోర్ మద్దాలి ఎడిటింగ్ వర్క్ చేస్తున్నారు. అలీ - దగ్గుబాటి రాజా - కళ్యాణి నటరాజన్ - బ్రహ్మాజీ - కృష్ణ భగవాన్ - రజిత - జబర్దస్త్ రామ్ ప్రసాద్ - నవీన్ - వెంకీ - రాఘవ - భరత్ తదితరులు ఇతర పాత్రల్లో నటించారు.