ఒక్క సినిమా చాలు ఎక్కడికో తీసుకువెళ్లటానికి, అలాగే ఒక్క సినిమా చాలు పాతాళానికి పడిపోవటానికి. రాహుల్ రవీంద్రన్ పరిస్దితి అలాగే ఉంది. ఓవర్ నైట్ లో మంచి డైరక్టర్ అన్న టాక్ వచ్చేసింది. బిజి అయ్యిపోతాడు బోలెడు సినిమాలు చేసేస్తాడు అనుకునేలోగా రెండో సినిమా బోల్తా కొట్టి...ఏం చేయాలో అర్దం కాని సిట్యువేషన్ లోకి తోసేసింది. దాంతో ఇప్పుడు ఆయన ఏం చేస్తున్నారు..తిరిగి నటనలోకి వస్తారా లేక డైరక్షన్ కంటిన్యూ చేస్తారా..ఏం చేయబోతున్నారనేది ఫిల్మ్ సర్కిల్స్ లో హాట్ టాపిక్ గా మారింది. అయితే ఆయన ప్లాన్ ఏంటనేది బయటకు వచ్చింది. అదేంటో చూద్దాం.

నాగార్జున, రకుల్ ప్రీత్ సింగ్ హీరో హీరోయిన్లుగా రాహుల్ రవీంద్రన్ దర్శకత్వంలో రూపొందిన చిత్రం 'మన్మధుడు 2'. ఈ  మూవీ బాగోలేదు అని మౌత్ టాక్ రావడంతో రెండో రోజు నుంచే వసూళ్లు తగ్గుముఖం పట్టాయి. దాంతో వారం తిరిగేకల్లా డిజాస్టర్ గా ఫిక్సై పోయింది. సాధారణంగా నాగార్జున సినిమా అంటే ఫ్యామిలీ ఆడియన్స్ ఎక్కువగా వస్తారు. అయితే తన వయస్సుకన్నా చిన్నవారైన ఇద్దరు ముగ్గురు అమ్మాయిలతో నాగార్జున లిప్ లాక్ సీన్లు చేయడం, రిలీజ్ తర్వాత రకుల్, ఝాన్సీ మధ్య ఎవరూ ఊహించని విధంగా ముద్దు సీన్ ఉండటం వల్ల కుటుంబ ప్రేక్షకుల్లో ఈ మూవీపై నెగిటివ్ ఇంపాక్ట్ పడింది. దీనికి తోడు మిక్డ్స్ టాక్ రావడంతో వసూళ్లు పడిపోయాయి. నాగ్ ఆ సినిమాని మర్చిపోయిండవచ్చుకానీ ఆ డైరక్టర్ కెరీర్ పై మాత్రం తీవ్రమైన ప్రభావం పడింది. 
 
హీరో కమ్ డైరెక్టర్ రాహుల్ ర‌వీంద్ర‌న్ తన మొదటి సినిమా ‘చి.ల.సౌ’తోనే మంచి హిట్ అందుకున్నాడు.  జాతీయ అవార్డును కూడా గెలుచుకున్నాడు. మన్మధుడు 2 దెబ్బతో కెరీర్ మొత్తం మటాష్ అయ్యిపోయిన పరిస్దితి ఏర్పడింది. ఈ నేపధ్యంలో తనకున్న పరిచయాలతో ఓ వెబ్ సీరిస్ ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. ఈ మేరకు ప్రస్తుతం తన ఓ స్క్రిప్ట్‌ను పూర్తి చేసే దిశలో ఉన్నాడు రాహుల్. అందుతున్న సమాచారం మేరకు నెట్‌ఫ్లిక్స్ కోసం ఒరిజినల్ వెబ్ సిరీస్‌ కు దర్శకత్వం వహించబోతున్నాడని సమాచారం. ఈ వెబ్ సిరీస్ లో వెన్నెల కిషోర్ నటించబోతున్నాడు.ఇక ఈ వెబ్ సిరీస్ కి సంబంధించి పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. మరి ఇంక సినిమాలు రాహుల్ చెయ్యరా అంటే ఆఫర్స్ వస్తనే కదా అన్నట్లుంది పరిస్దిది.