రోజులు గడిచే కొద్దీ బిగ్ బాస్ 3లో ఇంటి సభ్యులు సహనం కోల్పోతున్నారు. కొందరు అనవసరంగా ఎమోషనల్ అవుతున్నారు. షో ఆరంభంలో అతి చేస్తున్నట్లు అనిపించిన శ్రీముఖి స్ట్రాటజీ మార్చింది. ఇప్పుడు సందర్భోచితంగా వ్యవహరిస్తోంది. సైలెంట్ గా ఉన్నట్లు అనిపించిన పునర్నవి కొన్ని సందర్భాల్లో నేనింతే అన్నట్లుగా బిహేవియర్ చూపించింది. 

హిమజ, శివజ్యోతి, రోహిణి ఎప్పటిలానే కొనసాగుతున్నారు. బాబా భాస్కర్ కు క్రేజ్ పెరుతుతోంది. ఇదిలా ఉండగా సోమవారం జరిగిన ఎపిసోడ్ లో పునర్నవి చేసిన హంగామా అంతా ఇంతా కాదు. బాబా భాస్కర్, హిమజ, రోహిణి, మహేష్ లు పునర్నవిని నామినేట్ చేశారు. నామినేషన్ లో ప్రతి వారం ఎవరో ఒకరు ఉండాల్సిందే. బిగ్ బాస్ అనేది గేమ్. ఆ విషయం మరచిపోయి తొలి వారం నుంచి తనని టార్గెట్ చేస్తున్నారని పునర్నవి ఎమోషనల్ అయిపోయింది. 

బాబా భాస్కర్ మీరేమి హీరో కాదు.. అందరిలాగే ఓ కంటెస్టెంట్ అని మాట్లాడింది. కోపంతో పునర్నవి తాను ఎవరిని నామినేట్ చేయడం లేదని, తనని తానే నామినేట్ చేసుకుంటున్నాని బిగ్ బాస్ కు తెలిపింది.పెద్ద సీన్ జరిగాక వరుణ్ బతిమాలితే దిగొచ్చింది. 

ఇంత అతి చేస్తున్నా పునర్నవిపై ప్రేక్షకుల్లో వ్యతిరేకత లేదు. ఆమె బ్యూటీకి ఫిదా అవుతున్న ప్రేక్షకులు గంపగుత్తగా ఓట్లు గుద్దేస్తున్నారు. ఈ లెక్కన పునర్నవి ఈ వారం కూడా ఎలిమినేషన్ నుంచి బయటపడడం పెద్ద కష్టమేమి కాదు. ఇదే బిహేవియర్ కొనసాగిస్తే మాత్రం ఎదో ఒక సమయంలో పునర్నవిపై ఆడియన్స్ లో వ్యతిరేకత పెరగడం ఖాయం. బాబా భాస్కర్, పునర్నవి, రాహుల్, వితిక, తమన్నా ఈ వారం ఎలిమినేషన్ కోసం నామినేట్ అయ్యారు. 

బిగ్ బాస్ 3: ఎలిమినేషన్ పై పునర్నవి ఫైర్!

ట్రాన్స్ జెండర్ తో తిప్పలు పడుతోన్న హీరోయిన్ తమన్నా!

బిగ్ బాస్ 3: నువ్ మగాడివేనా? రవిపై విరుచుకుపడ్డ తమన్నా!

బిగ్ బాస్ 3: వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇంత వరస్టా..!