బిగ్ బాస్ మూడో సీజన్ లో వైల్డ్ కార్డ్ ఎంట్రీతో హౌస్ లోకి వెళ్లిన తమన్నా సింహాద్రి ఇప్పుడు హౌస్ లో చేస్తోన్న రచ్చ గురించి తెలిసిందే. హౌస్ లో ఆమె ప్రవర్తన కారణంగా అటు కంటెస్టంట్స్ తో పాటు ఇటు ప్రేక్షకులు కూడా విసిగిపోతున్నారు. అయితే సోషల్ మీడియాలో ఆమెని ట్రోల్ చేయాలనుకున్న నెటిజన్లు తమన్నా సింహాద్రి అఫీషియల్ ప్రొఫైల్ 
దొరకక హీరోయిన్ తమన్నా అఫీషియల్ ఐడీని లింక్ చేసి ట్వీట్ చేస్తున్నారు.

దీంతో గత పదిరోజులుగా తమన్నాకి ట్విట్టర్ ఓపెన్ చేయడం ఇబ్బందిగా మారింది. రోజుకి వేల కొద్ది వస్తోన్న ట్వీట్లతో తమన్నా నోటిఫికేషన్స్ బార్ నిండిపోయి ఉండాలి. హౌస్ లో తమన్నా ఏం చేసినా కానీ హీరోయిన్ తమన్నాని కూడా ట్యాగ్ చేస్తూ ట్వీట్లు వేయడాన్ని ట్రోలర్స్ ఎంజాయ్ చేస్తున్నారు. తమన్నా హేటర్స్ ఈ విధంగా ప్రవర్తిస్తున్నారనే కామెంట్స్ వినిపిస్తున్నాయి.

సాధారణంగా ఇండస్ట్రీలో హీరోయిన్ పేరు మరొకరు రిపీట్ చేసుకోరు. దాని వలన పెద్దగా వారికి ఇబ్బందులు కలగవు. కానీ ఈ కేస్ లో మాత్రం హీరోయిన్ తమన్నా బలవుతోంది. పైగా ఈ షోలో వరుణ్ సందేశ్ ఉండడం, గతంలో హీరోయిన్ తమన్నా అతడితో కలిసి 'హ్యాపీ డేస్' సినిమా చేసి ఉండడంతో మరింత ఎక్కువగా తమన్నాని ట్యాగ్ చేస్తున్నారు.

కొందరైతే తమన్నా సింహాద్రి సోషల్ మీడియా లింక్స్ తెలియక అసలు తమన్నానే డైరెక్ట్ గా తిట్టి పోస్తున్నారు. బిగ్ బాస్ హౌస్ లో తమన్నా ఉన్నంతకాలం తమన్నాకి ఈ ట్వీట్ల గోల, తిట్ల దండకం తప్పేలా లేదు!