బిగ్ బాస్ మూడో సీజన్ రెండు వారాలు పూర్తి చేసుకొని మూడో వారంలోకి అడుగుపెట్టింది. సోమవారం నాడు ఎలిమినేషన్ కి నామినేషన్ ఉండడంతో ఎపిసోడ్ పై ఆసక్తి పెరిగింది. మూడోవారం ఎలిమినేషన్స్ భాగంగా కీలకమైన నామినేషన్ ప్రాసెస్ ని చేపట్టారు బిగ్ బాస్. ఇందులో భాగంగా కంటెస్టెంట్ ఒక్కొక్కరినీ తమకి నచ్చని ఇద్దరిని నామినేట్ చేయాలని.. ఇందుకోసం ఎర్రటి రబ్బరు స్టాంప్‌ ఇచ్చారు బిగ్ బాస్.

తమకు నచ్చని కంటెస్టెంట్స్‌ పేరు చెప్పి వాళ్లకు నామినేషన్ స్టాంప్ గుద్దాలని స్టాంప్ ఇచ్చారు. బిగ్ బాస్ చెప్పినట్లుగా కంటెస్టెంట్స్ చేశారు. ఈ ఎలిమినేషన్ ప్రాసెస్ లో ఎక్కువ ఓట్లు వచ్చిన తమన్నా, పునర్నవి, రాహుల్, వితికా, బాబా భాస్కర్ లు ఈ వారం ఎలిమినేషన్ లో  నిలిచారు. మొత్తం ఈ వారం ఐదుగురు కంటెస్టెంట్స్ ఎలిమినేషన్ కి నామినేట్ అయ్యారు.

ఎలిమినేషన్ లో భాగంగా కంటెస్టెంట్స్ అందరూ తనను టార్గెట్ చేయడంతో పునర్నవి కోపాన్ని తట్టుకోలేక ఫైర్ అయింది. ప్రతీ ఒక్కరూ తనను టార్గెట్ చేస్తూ తన క్యారెక్టర్ ని డిసైడ్ చేస్తున్నారంటూ ఎమోషనల్ అయింది. తనకు ఇంక హౌస్ లో ఉండాలని లేదని.. సెల్ఫ్ నామినేట్ చేసుకుంది. తను గ్రూప్ లు కడుతున్నానంటూ నామినేట్ చేయడం కరెక్ట్ కాదంటూ ఫైర్ అయింది. పునర్నవి సెల్ఫ్ నామినేట్ చేసుకోవడాన్ని బిగ్ బాస్ ఒప్పుకోలేదు.

ఆ అధికారం లేదని హెచ్చరించినా పునర్నవి మాత్రం తగ్గలేదు. మీరు నామినేట్ చేయకపోతే.. హౌస్ మొత్తం నామినేషన్‌కి వెళ్తుందని, అంతేకాకుండా సీజన్ మొత్తం మిమ్మల్ని  ఎలిమినేషన్ కి నామినేట్ చేస్తానని బిగ్ బాస్ హెచ్చరించినా పునర్నవి తగ్గలేదు. దీంతో వరుణ్ సందేశ్ ఆమెకి సర్ధి చెప్పే ప్రయత్నం చేయగా.. ఫైనల్ గా నామినేట్ చేయడానికి అంగీకరించింది. హౌస్‌లో తనకు బలమైన కంటెస్టెంట్‌గా ఉన్న బాబా భాస్కర్‌ని, ఎక్కువగా ఎమోషనల్ అవుతుందని శివజ్యోతిని నామినేట్ చేసింది.