బిగ్ బాస్ మూడో సీజన్ రెండు వారాలు పూర్తి చేసుకొని మూడో వారంలోకి అడుగుపెట్టింది. సోమవారం నాడు ఎలిమినేషన్ కి నామినేషన్ ఉండడంతో ఎపిసోడ్ పై ఆసక్తి పెరిగింది. బిగ్ బాస్ చెప్పినట్లుగా ఒక్కో కంటెస్టెంట్ తమకి నచ్చని ఇద్దరు కంటెస్టెంట్స్ ని నామినేట్ చేయడంతో నామినేషన్ ప్రాసెస్ పూర్తయింది. ఎలిమినేషన్ లో ఎక్కువ ఓట్లు వచ్చి తమన్నా, పునర్నవి, రాహుల్, వితికా, బాబా భాస్కర్‌లు ఈవారం ఎలిమినేషన్‌లో నిలిచారు.

ఓ పక్క ఎలిమినేషన్ ప్రాసెస్ జరుగుతుంటే మరోపక్క ట్రాన్స్ జెండర్ తమన్నా తన ప్రవర్తనతో హౌస్ లో ఉన్న కంటెస్టెంట్స్ తో పాటు ఆడియన్స్ ని కూడా విసిగించింది. మొదట రవికృష్ణ తనను నామినేట్ చేశాడని అతడిపై నోరు పారేసుకుంది. అలానే అలీని కూడా టార్గెట్ చేసింది. తమన్నా మాట్లాడేది కరెక్ట్ కాదంటూ శ్రీముఖి, రోహిణిలు ఆమెకి చెబుతుంటే వారిపై కూడా ఫైర్ అయింది.

ఇక ఎలిమినేషన్ అయిన తరువాత రవిక్రిష్ణను టార్గెట్ చేస్తూ.. నువ్ అసలు మగాడివేనా? ఉన్న వాటిని కూడా గీసేసుకో.. పప్పూ అంటూ వ్యక్తిగతంగా అతడిని దూషించింది. తమన్నా ప్రవర్తన బాగాలేదని కంటెస్టెంట్స్ చెప్పే ప్రయత్నం చేస్తుంటే.. హౌస్ లో తనకు ఇష్టం వచ్చినట్లు ఉంటానని.. తనకు నచ్చింది చేస్తానని.. తనకు ఎవరైనా లెక్చర్ 
ఇస్తే మామూలుగా ఉండదని వార్నింగ్ ఇచ్చింది. తమన్నా తనను ఎన్ని మాటలు అంటున్నా.. రవి మాత్రం ఆమెని ఒక్కమాట కూడా అనకుండా సైలెంట్ గా ఉండిపోయాడు. 

బిగ్ బాస్ 3: ఎలిమినేషన్ పై పునర్నవి ఫైర్!