బిగ్ బాస్ మూడో సీజన్ మొదలై రెండు వారాలు పూర్తయింది. ఈ షోలో గొడవలు అనేవి చాలా కామన్. టాస్క్ లలో విబేధాలు రావడం, ఒకరి ప్రవర్తన మరొకరికి నచ్చకపోవడం ఇలా రకరకాల కారణాలతో కంటెస్టంట్స్ ఒకరితో మరొకరు గొడవలు పడుతూ ఉంటారు. వారు ఎంతగా గొడవ పడినా అందులో ఒకరకమైన వినోదం కనిపించేది. గొడవ పడినప్పటికీ 
హుందాగా వ్యవహరించేవారు.

కానీ ఎప్పుడైతే హౌస్ లోకి తమన్నా సింహాద్రి ఎంటర్ అయిందో హౌస్ రూపమే మారిపోయింది. ఆమె రాకముందు కూడా హౌస్ లో గొడవలు జరిగేవి కానీ అసహ్యంగా అనిపించేది కాదు. కానీ ఆమె రాకతో హౌస్ నీచంగా తయారైంది. షో చూసే ప్రేక్షకుడు తమన్నా ప్రవర్తనతో విసిగిపోతున్నాడు. నిన్న జరిగిన నామినేషన్ ప్రాసెస్ లో తమన్నా మాటలకు హౌస్ మేట్స్ తో పాటు ప్రేక్షకులు కూడా షాక్ అయ్యారు.

ఆమెతో వాదనకు దిగడానికి కూడా ఎవరూ ఆసక్తి చూపలేదు. శ్రీముఖి కంట్రోల్ చేయడానికి ప్రయత్నిస్తూ తమన్నా మాత్రం తగ్గలేదు. పునర్నవి జోక్యం చేసుకొని సర్దిచెప్పడంతో తమన్నా తన తిట్లను కాస్త కంట్రోల్ చేసుకుంది. ఆ తరువాత మళ్లీ రవికృష్ణపై విరుచుకుపడుతూ నానా రచ్చ చేసింది. మగ వేషంలో ఉన్న ట్రాన్స్ జెండర్ అంటూ అతడిని  దూషించింది.

తమన్నా లాంటి వ్యక్తి హౌస్ లో ఉండడాన్ని ప్రేక్షకులు  తట్టుకోలేకపోతున్నారు. ఆమె హౌస్ లో ఉండడానికి వీలు లేదని ఆమెని ఎలిమినేట్ చేయాలని కోరుతున్నారు. తాజా పరిణామాల నడుమ తమన్నా ఎలిమినేట్ అయ్యే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఆమె వ్యవహారశైలితో కంటెస్టంట్స్ ఇమడలేకపోతున్నారు. కనీసం నాగ్ సీన్ లోకి ఎంటర్ అయి వార్నింగ్ ఇవ్వడానికి కూడా లేదు. ఆయన రావడానికి మరో నాలుగు రోజుల సమయం పడుతుంది. ఈలోగా తమన్నా ఎంత రచ్చ చేస్తుందో చూడాలి! 

ట్రాన్స్ జెండర్ తో తిప్పలు పడుతోన్న హీరోయిన్ తమన్నా!