ఒక్క కన్నుగీటితో ప్రపంచం మొత్తం తనవైపు చూసేలా చేసుకుంది ప్రియా ప్రకాష్ వారియర్. 'ఒరు అడార్ లవ్' సినిమాకి సంబంధించిన పాటలు, ప్రోమోలతో ఆమె విపరీతమైన క్రేజ్ సంపాదించుకుంది. సోషల్ మీడియాలో ఆమె ఫ్యాన్ ఫాలోయింగ్ విపరీతంగా పెరిగిపోయింది. 

కానీ ఇప్పటివరకు ఆమె ఒక్క తెలుగు సినిమా కూడా సైన్ చేయలేదు.  ఇప్పటికే ప్రముఖ నిర్మాత దిల్ రాజు తన బ్యానర్ లో సినిమాలు చేయమని ఆమెను సంప్రదించగా.. దానికి ఆమె అంగీకరించలేదు. తెలుగులో అఖిల్ తో కలిసి ఓ యాడ్ లో మాత్రమే నటించింది.

తాజాగా మెగాఫ్యామిలీ హీరో కోసం ఆమెని సంప్రదించగా వచ్చిన ఆఫర్ ని రిజెక్ట్ చేసినట్లు తెలుస్తోంది. మెగాస్టార్ అల్లుడు కళ్యాణ్ దేవ్ హీరోగా పులి వాసు అనే నూతన దర్శకుడు ఓ సినిమా ప్లాన్ చేశాడు. త్వరలోనే ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లనుంది.

ఈ సినిమాలో హీరోయిన్ గా నటించమని ప్రియా ప్రకాష్ వారియర్ ని సంప్రదించారట. కానీ దానికి ఆమె అంగీకరించలేదని సమాచారం. టాలీవుడ్ లో స్టార్ హీరోలతో మాత్రమే  నటించాలని ప్రియా భావిస్తోందట. ఆ కారణంగానే కళ్యాణ్ సినిమాను రిజల్ట్ చేసిందట. 

ఇవి కూడా చదవండి.. 

కన్నుగీటిన బ్యూటీ దేశీ గెటప్!

ప్రియా ప్రకాష్ కు ఊరట: పిటిషన్లను కొట్టేసిన సుప్రీంకోర్టు

తక్కువ చేసి మాట్లాడకండి.. ప్రియా ప్రకాష్ వారియర్ వ్యాఖ్యలు!

ప్రియా వారియర్ కు గౌన్ తెచ్చిన కష్టాలు!

కన్నుకొట్టి యాడ్స్ కూడా తెచ్చుకుంది

కన్ను కొట్టినందుకే కోటి ఇచ్చేశారు

షాక్..! రోడ్డుకెక్కిన ప్రియా వారియర్