స్టార్ సెలబ్రిటీగా మారింది యంగ్ హీరోయిన్ ప్రియా ప్రకాష్ వారియర్. కేవలం కనుసైగలతో ఓవర్‌నైట్‌లో స్టారయిపోయిన ఈ అమ్మడు, జాతీయస్థాయిలో పాపులరీ సంపాదించుకుంది. ఈ క్రమంలో బాలీవుడ్ స్టార్ హీరోల పక్కన ఆఫర్స్ పట్టేసిందంటూ ప్రచారం సాగింది. ఆ విషయం కాసేపు పక్కనబెడితే.. తనకున్న ఇమేజ్‌ని ఫుల్‌గా క్యాష్ చేసుకుంటోంది ఈ సుందరి.

ఇటీవల ఓ యాడ్‌లో నటించిన ప్రియా, రెమ్యునరేషన్ దాదాపు కోటిరూపాయలు తీసుకున్నట్టు సమాచారం. దీనికి సంబంధించి మొన్న శుక్రవారం ఆ యాడ్ షూట్ చేశారు. కొత్తగా గ్లామర్ ఇండస్ర్టీలోకి వచ్చినవాళ్లకి కోటి రూపాయలన్నది చాలా ఎక్కువని సదరు కంపెనీ ప్రతినిధులు చెబుతున్నమాట.