తక్కువ చేసి మాట్లాడకండి.. ప్రియా ప్రకాష్ వారియర్ వ్యాఖ్యలు!

https://static.asianetnews.com/images/authors/74ce1d03-f84b-5b8e-abc1-c43c5f7c8632.jpg
First Published 25, Aug 2018, 4:37 PM IST
Priya Prakash Varrier does her bit for flood-hit Kerala
Highlights

'ఒరు అడార్ లవ్' సినిమాలో ఓ పాటల కన్నుకొడుతూ కనిపించి యూత్ అందరినీ తనవైపు తిప్పేసుకుంది ప్రియా ప్రకాష్ వారియర్.  సోషల్ మీడియాలో ఆమె సెన్సేషన్ గా మారింది. 

'ఒరు అడార్ లవ్' సినిమాలో ఓ పాటల కన్నుకొడుతూ కనిపించి యూత్ అందరినీ తనవైపు తిప్పేసుకుంది ప్రియా ప్రకాష్ వారియర్.  సోషల్ మీడియాలో ఆమె సెన్సేషన్ గా మారింది. కొద్దిరోజుల పాటు ఎక్కడ చూసినా ఆమె టాపిక్కే.. ఫేస్ బుక్, ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్ వంటి అకౌంట్లు ఆమె ఫొటోలు, వీడియోలతో నిండిపోయాయి. అంతగా ఫాలోయింగ్ తెచ్చుకున్న ఈ నటి కేరళ వరద బాధితులకు తన వంతు సహాయం అందించింది.

అయితే పబ్లిసిటీ కోసం ఇలా చేశానని అనుకోవద్దంటూ ఓ సందేశాన్ని రాసుకొచ్చింది. ''ఈ ఓనం పండుగకు నేను రాష్ట్రం కోసం చేయగలిగింది చేశాను. మాటలు చెప్పడం కంటే చేతల్లో చేస్తే.. ఇంకా ఎక్కువ ఇంపాక్ట్ ఉంటుందని అనిపిస్తుంది. నేను పబ్లిసిటీ కోసం విరాళం ఇవ్వలేదు. మేం ఎంత విరాళం ఇచ్చామో తెలిస్తే.. అప్పుడు ప్రజలు దాన్ని సక్రమంగా వినియోగించుకుంటారు.

అందుకే చెబుతున్నాను. మీరు ఏ విషయంలో నన్ను ప్రశంసించకపోయినా పర్వాలేదు కానీ తక్కువ చేసి మాట్లాడకండి'' అంటూ ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ద్వారా తెలిపారు. ఈ పోస్ట్ తో పాటు ముఖ్యమంత్రి సహాయనిధికి లక్ష రూపాయలు విరాళం అందించినట్లు ఉన్న లేఖను షేర్ చేసుకున్నారు. 

loader