మళయాళ నటి ప్రియా వారియర్‌కు వ్యతిరేకంగా సుప్రీంకోర్టులో దాఖలైన పిటిషన్లను సుప్రీంకోర్టు శుక్రవారం కొట్టివేసింది.
న్యూఢిల్లీ: మళయాళ నటి ప్రియా వారియర్‌కు వ్యతిరేకంగా సుప్రీంకోర్టులో దాఖలైన పిటిషన్లను సుప్రీంకోర్టు శుక్రవారం కొట్టివేసింది.
మళయాళ నటి ప్రియా వారియర్ కు వ్యతిరేకంగా తెలంగాణలో కేసు నమోదైంది. అంతేకాదు ఈ కేసుతో పాటు పలు కేసులు దేశ వ్యాప్తంగా నమోదయ్యాయి.ఈ కేసులపై దాఖలైన పిటిషన్లను సుప్రీంకోర్టు శుక్రవారం నాడు కొట్టివేస్తూ నిర్ణయం తీసుకొంది.
ప్రియా ప్రకాష్ వారియర్ ఓ పాటలో కన్నుగీటడంతో ప్రఖ్యాతి చెందింది.ఈ పాటపై కొందరు అభ్యంతరం వ్యక్తం చేశారు. మత విశ్వాసాలను దెబ్బతీసేలా ఈ పాట ఉందని అభిప్రాయపడ్డారు. హైద్రాబాద్‌లో కొందరు ప్రియా ప్రకాష్ వారియర్ పై కేసు పెట్టారు. ఇదే తరహలో మహారాష్ట్రలో కూడ కేసులు నమోదయ్యాయి.
ఈ కేసు రిజిస్టర్ చేయడంపై ఏం పనిలేదా అంటూ సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ దీపక్ మిశ్రా అభిప్రాయపడ్డారు. తెలంగాణతో పాటు దేశంలో పలు చోట్ల తనపై దాఖలైన పిటిషన్లపై ప్రియా ప్రకాష్ వారియర్ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. దీంతో ప్రియా ప్రకాష్ వారియర్ కు ఊరట లభించినట్టైంది.
