ఒక్క కన్నుగీటుతో యూత్ మొత్తం అందరినీ తనవైపు తిప్పుకుంది ప్రియా వారియర్. 'ఒరు అడార్ లవ్' సినిమాలో చిన్న వీడియో క్లిప్ తో ఫేమస్ అయిపోయింది ఈ బ్యూటీ. ప్రస్తుతం ప్రియా ఏం చేసినా సోషల్ మీడియాలో ట్రెండింగ్ అవుతోంది. తాజాగా ప్రియా ఏషియానెట్ అవార్డ్స్ 2018 సినిమా ఫంక్షన్ లో పాల్గొంది.

ఈ వేడుకకు బ్లాక్ కలర్ గౌన్ వేసుకొచ్చింది. ఆ డ్రెస్ లో ఎంతో అందంగా కనిపిస్తోంది. కానీ ఆ డ్రెస్ చాలా బరువుగా ఉండడంతో దాన్ని మోయలేక చాలా ఇబ్బంది పడింది. దీనికోసం ఓ సహాయకురాలి కూడా నియమించుకొని గౌన్ మోసే భారం ఆమెకు అప్పగించింది. ఇప్పుడు దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో దర్శనమిస్తోంది.