యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన సాహో చిత్రం ఆగష్టు 30న ప్రేక్షకుల ముందుకు రానుంది. నేడు( ఆదివారం 18 ఆగష్టు) రామోజీ ఫిలిం సిటీలో అంగరంగ వైభవంగా ప్రీరిలీజ్ ఈవెంట్ నిర్వహిస్తున్నారు. 

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ మాట్లాడుతూ.. దర్శకుడు సుజీత్ కి మాస్ పల్స్ బాగా తెలుసు అని ప్రభాస్ తెలిపాడు. సాబు సిరిల్, సంగీత దర్శకుడు జిబ్రాన్ ఇలా ప్రతి టెక్నీషియన్, ఈ చిత్రానికి పనిచేసిన నటీనటులకు ప్రభాస్ కృతజ్ఞతలు తెలిపాడు. 

దర్శకుడు సుజిత్ నిక్కర్లేసుకునే వయసులో ఈ కథ చెప్పాడు అని ప్రభాస్ సరదాగా వ్యాఖ్యానించాడు. చాలా చిన్న వయసులోనే రన్ రాజా రన్ చిత్రాన్ని తెరకెక్కించాడు. సుజీత్ బహుశా అంతర్జాతీయ దర్శకుడు ఐపోతాడేమో అని ప్రభాస్ వ్యాఖ్యానించాడు. 

ఈ చిత్రానికి శ్రద్దా కపూర్ లాంటి హీరోయిన్ దొరకడం మా అదృష్టం. ముంబై నుంచి వచ్చి యాక్షన్ సన్నివేశాలలో అదరగొట్టేసింది. ఈ చిత్ర నిర్మాతలు తన ప్రాణ స్నేహితులు అని ప్రభాస్ తెలిపాడు. ఇలాంటి స్నేహితులు అందరికి ఉండాలని ప్రభాస్ తెలిపాడు. 

సాహో ప్రీరిలీజ్ ఈవెంట్: ప్రభాస్ కి అందుకే అంతమంది అభిమానులు.. రాజమౌళి!

సాహో ప్రీరిలీజ్ ఈవెంట్: డైహార్డ్ ఫ్యాన్స్ అనే డైలాగ్ అందుకు రాశా.. సుజీత్!

సాహో ప్రీరిలీజ్ ఈవెంట్: మిర్చికి అంత బడ్జెట్ ఎందుకని అడిగా.. దిల్ రాజు!

సాహో ప్రీరిలీజ్ ఈవెంట్: 50 రోజులు ప్రభాస్ ఇంటి నుంచే భోజనం!

సాహో ప్రీరిలీజ్ ఈవెంట్: ప్రభాస్ సర్ స్వయంగా అడిగారు.. అరుణ్ విజయ్!