యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన సాహో చిత్రం ఆగష్టు 30న ప్రేక్షకుల ముందుకు రానుంది. నేడు( ఆదివారం 18 ఆగష్టు) రామోజీ ఫిలిం సిటీలో అంగరంగ వైభవంగా ప్రీరిలీజ్ ఈవెంట్ నిర్వహిస్తున్నారు. 

దర్శక ధీరుడు రాజమౌళి మాట్లాడుతూ.. తమ హీరో సినిమా హిట్ కావాలని ఆయా హీరోల అభిమానులు కోరుకుంటారు. కానీ ప్రతి హీరో అభిమాని ప్రభాస్ సినిమా హిట్ కావాలని కోరుకుంటారు. అది ప్రభాస్ అంటే అని రాజమౌళి తెలిపారు. ప్రభాస్ ఎప్పుడూ ఎక్కడా ఎవరి గురించి చెడుగా మాట్లాడడు. అతడి పక్కన ఎప్పుడూ పాజిటివ్ వైబ్రేషన్స్ ఉంటాయి అని రాజమౌళి తెలిపారు. 

ప్రభాస్ కి దూరదృష్టి ఎక్కువ. బాహుబలి సమయంలోనే తన తదుపరి చిత్రం గురించి ఆలోచించాడు. ఒకరోజు బాహుబలి సెట్స్ లో సుజిత్ ఓ కథ చెప్పాడు డార్లింగ్ అద్భుతంగా ఉంది అని అప్పుడే తనకు సాహో గురించి చెప్పినట్లు రాజమౌళి తెలిపారు. 

సుజిత్ ని అభినందిస్తూ.. సుజిత్ సత్తా ఏమిటో ఈ చిత్రంతో అందరికి తెలిసిపోయింది. అంతా కుర్రాడు ఎం చేస్తాడు అనుకున్నారు.. కానీ ఆ అనుమానాలన్నింటినీ టీజర్ తో పటాపంచలు చేసేసినట్లు రాజమౌళి ప్రశంసించారు. ఈ చిత్రం ఘనవిజయం సాధించాలని కోరుకుంటూ తన ప్రసంగాన్ని ముగించాడు. 

సాహో ప్రీరిలీజ్ ఈవెంట్: డైహార్డ్ ఫ్యాన్స్ అనే డైలాగ్ అందుకు రాశా.. సుజీత్!

సాహో ప్రీరిలీజ్ ఈవెంట్: మిర్చికి అంత బడ్జెట్ ఎందుకని అడిగా.. దిల్ రాజు!

సాహో ప్రీరిలీజ్ ఈవెంట్: 50 రోజులు ప్రభాస్ ఇంటి నుంచే భోజనం!

సాహో ప్రీరిలీజ్ ఈవెంట్: ప్రభాస్ సర్ స్వయంగా అడిగారు.. అరుణ్ విజయ్!