యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన సాహో చిత్రం ఆగష్టు 30న ప్రేక్షకుల ముందుకు రానుంది. నేడు( ఆదివారం 18 ఆగష్టు) రామోజీ ఫిలిం సిటీలో అంగరంగ వైభవంగా ప్రీరిలీజ్ ఈవెంట్ నిర్వహిస్తున్నారు. 

ప్రీరిలీజ్ ఈవెంట్ లో స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు మాట్లాడుతూ.. మరోసారి ఇంత మంది అభిమానులని చూస్తానో లేదో అంటూ సెల్ఫీ తీసుకున్నారు. బాహుబలితో తెలుగు సినిమా సత్తాని ప్రపంచం మొత్తానికి తెలియజేసిన రాజమౌళికి కృతజ్ఞతలు అని తెలిపారు. యువి క్రియేషన్స్ నిర్మాతలతో నాకు మంచి రిలేషన్ ఉంది. మిస్టర్ పర్ఫెక్ట్ తర్వాత యువీ నిర్మాతలు మిర్చి చిత్రాన్ని తీశారు. ఆ చిత్రానికి మిస్టర్ పర్ఫెక్ట్ కు మించి డబ్బు ఖర్చయింది. అంత డబ్బు ఎందుకు పెడుతున్నారు అని అడిగా.. ప్రభాస్ కోసం అని బదులిచ్చారు. 

మళ్లీ బాహుబలి తర్వాత అంతకు మించి సాహో చిత్రానికి భారీ బడ్జెట్ పెట్టారు. ఈ సారి కూడా ప్రభాస్ కోసమే అని బదులిచ్చారు. సాహో నిర్మాతలని చూసి నేను ఆలిండియా ఫిలిం ఎలా తీయాలో నేర్చుకుంటున్నా అని దిల్ రాజు తెలిపారు. రాజమౌళికి బాహుబలి లాంటి చిత్రం తీయడానికి 10 సినిమాలకు పైగా సమయం పట్టింది. కానీ సుజీత్ రెండవ చిత్రంతోనే ఆలిండియా చిత్రాన్ని డైరెక్ట్ చేసాడని ప్రశంసించారు. 

ప్రభాస్ ఆలిండియా స్టార్. ఏ రాష్ట్రానికి వెళ్లినా ప్రభాస్ అభిమానులు కనిపిస్తున్నారు. ప్రభాస్ ఇలాగే భారీ చిత్రాల్లో నటిస్తూ అంతర్జాతీయ స్థాయికి ఎదగాలని దిల్ రాజు కోరారు. 

సాహో ప్రీరిలీజ్ ఈవెంట్: 50 రోజులు ప్రభాస్ ఇంటి నుంచే భోజనం!

సాహో ప్రీరిలీజ్ ఈవెంట్: ప్రభాస్ సర్ స్వయంగా అడిగారు.. అరుణ్ విజయ్!