యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన సాహో చిత్రం ఆగష్టు 30న ప్రేక్షకుల ముందుకు రానుంది. నేడు( ఆదివారం 18 ఆగష్టు) రామోజీ ఫిలిం సిటీలో అంగరంగ వైభవంగా ప్రీరిలీజ్ ఈవెంట్ నిర్వహిస్తున్నారు. ప్రీరిలీజ్ ఈవెంట్ వద్ద అభిమానుల కోలాహలం నెలకొని ఉంది. 

ప్రీరిలీజ్ ఈవెంట్ లో మురళి శర్మ మాట్లాడుతూ.. సాహో ట్రైలర్ లోని డైలాగ్ చెప్పి అలరించారు. యువి క్రియేషన్స్ తన సొంత సంస్థ లాంటిది అని మురళి శర్మ తెలిపారు. నేను ఈ చిత్రం కోసం 75 రోజులు షూటింగ్ లో పాల్గొంటే 50 రోజులు ప్రభాస్ ఇంటి నుంచి భోజనం వచ్చిందని మురళి శర్మ తెలిపారు. ప్రొడక్షన్ డిజైనర్ సాబు సిరిల్ కూడా వేదికపై మాట్లాడారు. 

సాహో ప్రీరిలీజ్ ఈవెంట్: ప్రభాస్ సర్ స్వయంగా అడిగారు.. అరుణ్ విజయ్!