యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన సాహో చిత్రం ఆగష్టు 30న ప్రేక్షకుల ముందుకు రానుంది. నేడు( ఆదివారం 18 ఆగష్టు) రామోజీ ఫిలిం సిటీలో అంగరంగ వైభవంగా ప్రీరిలీజ్ ఈవెంట్ నిర్వహిస్తున్నారు. 

ఈప్రీరిలీజ్ ఈవెంట్ లో సాహో చిత్ర దర్శకుడు సుజిత్ మాట్లాడుతూ.. టీజర్ లో డై హార్డ్ ఫాన్స్ అనే డైలాగ్ ఉంటుంది. మీరంతా ఈ చిత్రం కోసం రెండేళ్లుగా ఓపిగ్గా ఎదురుచూశారు. అందుకే ఆ డైలాగ్ రాశానని సుజిత్ ప్రభాస్ అభిమానులని ఉద్దేశించి తెలిపాడు. 

షార్ట్ ఫిలిమ్స్ తో దర్శకుడినయ్యా. నా షార్ట్ ఫిలిమ్స్ ని ప్రభాస్ చూశారు.వీడెవడో స్క్రీన్ ప్లే బాగా చేస్తున్నాడు. ఒకసారి కలవాలి అని ప్రభాస్ గారు అడిగారట. అలా ప్రభాస్ ని మొదట కలుసుకున్నానని సుజీత్ తెలిపారు. ట్రైలర్ లో చివర్లో ప్రభాస్ తల నుంచి రక్తం వచ్చే సన్నివేశం గురించి 2014లో చెప్పా. రెండేళ్ల తర్వాత కూడా ప్రభాస్ ఆ సీన్ ని గుర్తుపెట్టుకుని చెప్పారు. ఆయనకు అంత మెమొరీ ఉంది. 

సాబు సిరిల్ ఈ చిత్రానికి అద్భుతమైన సెట్స్ అందించారు. సంగీత దర్శకుడు జిబ్రాన్ ఈ చిత్రానికి మ్యూజిక్ అదరగొట్టేశాడు అని ఈ చిత్రానికి పని చేసిన టెక్నీషియన్లని సుజీత్ ప్రశంసించాడు. 

సాహో ప్రీరిలీజ్ ఈవెంట్: మిర్చికి అంత బడ్జెట్ ఎందుకని అడిగా.. దిల్ రాజు!

సాహో ప్రీరిలీజ్ ఈవెంట్: 50 రోజులు ప్రభాస్ ఇంటి నుంచే భోజనం!

సాహో ప్రీరిలీజ్ ఈవెంట్: ప్రభాస్ సర్ స్వయంగా అడిగారు.. అరుణ్ విజయ్!