కొత్త ఏడాదిని పురస్కరించుకుని తన అభిమానులకు, ప్రేక్షకులకు స్టార్ట్స్ బ్యాక్‌ టూ బ్యాక్‌ న్యూ ఇయర్‌ గిఫ్ట్స్ ఇస్తున్నారు. పవన్‌ `వకీల్‌ సాబ్‌` నయా పోస్టర్‌ని విడుదల చేశారు. ఇక ప్రభాస్ తాను నటిస్తున్న `రాధేశ్యామ్‌`కి చెందిన న్యూ పోస్టర్ ని విడుదల చేశారు. ఇందులో ప్రభాస్‌ ఓ మౌంటేన్‌పై కూర్చొని ఉన్నాడు. చేతులతో ఏదో లాగుతూ, సైడ్‌లోకి చిరునవ్వుతూ చూస్తున్నాడు ప్రభాస్‌. ఇందులో చాలా క్యూట్ గా కనిపిస్తున్నాడు ఈ పాన్‌ ఇండియా స్టార్. చిత్ర బృందం, పూజాహెగ్డే, దర్శకుడు రాధాకృష్ణ ఈ కొత్త పోస్టర్లని పంచుకుని కొత్త సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు.. 

న్యూ ఇయర్‌ని పురస్కరించుకుని అర్థరాత్రి విడుదల చేసిన ఈ పోస్టర్‌ సైతం సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతుంది. ప్రభాస్‌ ఫ్యాన్స్ దీన్ని వరుసగా ట్వీట్లు, రీట్వీట్లతో ట్రెండ్‌ చేస్తున్నారు. `జిల్‌` ఫేమ్‌ రాధాకృష్ణ కుమార్‌ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమా శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటోంది. ఇందులో పూజా హెగ్డే హీరోయిన్‌గా నటిస్తుంది. బాలీవుడ్‌ నటి భాగ్యశ్రీ కీలక పాత్ర పోషిస్తుంది. యూవీ క్రియేషన్స్, గోపీకృష్ణ మూవీస్‌ పతాకాలపై వంశీ, ప్రమోద్‌, ప్రసీద నిర్మిస్తున్నారు. ఇది తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో రూపొందిస్తున్నారు.