Asianet News TeluguAsianet News Telugu

పెళ్లికి ముందే సెక్స్ గురించి ఓపెనైన ప్రభాకర్‌ కొడుకు.. కానీ తొలి సినిమాతోనే ఈ రేంజ్‌లో రెచ్చిపోయాడేంటి?

ప్రభాకర్‌ కొడుకు చంద్రహాస్‌ `బ్లాక్‌ డాగ్‌ ఫర్‌ ఏ వైట్‌ చిక్‌` అనే బోల్డ్ టైటిల్‌తో సినిమా చేస్తున్నారు. తాజాగా ఈ టైటిల్‌ని ప్రకటించారు. అంతేకాదు శనివారం ఫస్ట్ గ్లింప్స్ విడుదల చేశారు.

prabhakar son chandrahass new movie black dog for a white chick glimpse out
Author
First Published Dec 17, 2022, 4:53 PM IST

ఈటీవీ ప్రభాకర్‌ తనయుడు చంద్రహాస్‌ హీరోగా ఎంట్రీ ఇస్తున్న విషయం తెలిసిందే. ఆ మధ్యనే ఆయన సినిమా ప్రారంభమైంది. అప్పుడే అదిరిపోయే అప్‌డేట్‌ ఇచ్చాడు. తన తొలి టైటిల్‌తోపాటు ఫస్ట్ గ్లింప్స్ ని విడుదల చేశారు. `బ్లాక్‌ డాగ్‌ ఫర్‌ ఏ వైట్‌ చిక్‌` అనే బోల్డ్ టైటిల్‌తో సినిమా చేస్తున్నారు. తాజాగా ఈ టైటిల్‌ని ప్రకటించారు. అంతేకాదు శనివారం ఫస్ట్ గ్లింప్స్ విడుదల చేశారు. బోల్డ్ కంటెంట్‌తో ఉన్న ఈ ఫస్ట్ గ్లింప్స్ ఇప్పుడు యూట్యూబ్‌లో రచ్చ చేస్తుంది. 

ఇందులో విదేశీ అమ్మాయితో చంద్రహాస్‌ రొమాన్స్ చేస్తుండటం, ఈ క్రమంలో ఆయన చెప్పే డైలాగులు ఆకట్టుకుంటున్నాయి. స్విమ్మింగ్‌ పూల్‌లో బికినీలో ఉన్న ఫారెన్‌ అమ్మాయిని చూసి టెంప్ట్ అవుతాడు చంద్రహాస్‌. అమ్మదీనమ్మ ఇంత తెల్లగా ఉందేంట్రా బాబూ అంటాడు. ఆ అమ్మాయి హాట్‌ యోగాలు చేస్తున్న నేపథ్యంలో ఆమెని చూస్తూ మరింత హీటెక్కిపోతుంటాడు. అమ్మాయి దగ్గరకు రాగానే మీరు సెక్స్ చేస్తే గానీ పెళ్లి చేసుకోరు, మేం పెళ్లి చేసుకుంటేగానీ సెక్స్ చేయమని చెబుతాడు. మాట వరుసకు చెప్పాడు గానీ ఆ తర్వాత రెచ్చిపోయాడు. రొమాన్స్ లో మునిగిపోయాడు. 

చివరగా మమ్మల్నే బ్లాక్‌ డాగ్‌ అంటావే.. నీ అమ్మ.. బ్లడీ.. `అంటూ ఓ బూతు పదం వదిలేసినట్టున్నాడు చంద్రహాస్‌. అంతటితో గ్లింప్స్ పూర్తయ్యింది. మొత్తంగా బోల్డ్ టైటిలే కాదు, గ్లింప్స్ కూడా అంతే బోల్డ్ గా, ఓవర్‌ డోస్‌తో ఉండటం విశేషం. ప్రస్తుతం ఇది నెట్టింట దుమారం రేపుతుంది. నటుడు, దర్శకుడు ప్రభాకర్‌ కొడుకు హీరోగా ఎంట్రీ ఇలాంటి సినిమాతో కావడం ఆశ్చర్యపరుస్తుంది. అసలే ఓపెనింగ్‌ రోజు చంద్రహాస్‌ స్టయిల్‌, యాటిట్యూడ్‌ విషయంలో నెటిజన్లు ఆడుకున్నారు. ట్రోల్స్ చేశారు. ఇటీవల స్వామి మాలలో ఉండి కూడా ఆయన ఇచ్చిన పోజులు ట్రోల్స్ కి గురయ్యాయి. 

ఇప్పుడు తొలి సినిమాతోనే ఇంత బోల్డ్ కంటెంట్‌ని ఎంచుకోవడం, పైగా గ్లింప్స్ లో బికినీ పోజులు, లిప్‌ లాక్‌లు, అంతకు మించిన రొమాంటిక్‌ సీన్లు చూపించడంతో ఇక ట్రోలర్స్ ఏం రేంజ్‌లో ఆడుకుంటారో అనే అనుమానాలు స్టార్ట్ అవుతున్నాయి. చంద్రహాస్‌ని మరోసారి నెట్టింట రచ్చ లేపబోతారని చెప్పడంలో అతిశయోక్తి లేదు. అయితే ఈ గ్లింప్స్ లో `యాటిట్యూడ్‌ స్టార్‌` అని చంద్రహాస్‌కి ట్యాగ్‌ వేయడం గమనార్హం. ట్రోలర్స్ ని ఇది మరింత రెచ్చగొట్టేలా ఉందని అంటున్నారు. 

ఇక ఈ చిత్రంలో ఆయనకు జోడీగా కేట్‌ హీరోయిన్‌గా నటిస్తుంది. నాని కృష్ణ దర్శకత్వం వహిస్తున్నారు. ఆర్‌కాక్‌ ఫిల్మ్స్, ఇటాలియన్‌ ఆఫ్‌ ది ఈస్ట్ కార్పోరేషన్‌ బ్యానర్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఇదిలా ఉంటే ఈ చిత్రాన్ని పాన్‌ ఇండియా మూవీగా తెరకెక్కిస్తున్నారు. తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీలోనూ విడుదల చేయబోతున్నట్టు ప్రటించడం విశేషం. వీటితోపాటు మరో రెండు సినిమాల్లో నటిస్తున్నాడు చంద్రహాస్‌. ఎంట్రీనే మూడో సినిమాలతో రాబోతుండటం విశేషం.

Follow Us:
Download App:
  • android
  • ios