జగన్ పై గురువారం నాడు జరిగిన దాడి నేపధ్యంలో హీరో శివాజీ 'ఆపరేషన్ గరుడ' హాట్ టాపిక్ గా మారింది. శివాజీ చెప్పినట్లుగా జగన్ పై దాడి జరిగిందనే వార్తలు హల్చల్ చేశాయి. అప్పట్లో శివాజీ చెప్పిన 'ఆపరేషన్ గరుడ'ని కొట్టిపారేసిన నేతలు ఇప్పుడు జగన్ పై దాడి జరిగిన వెంటనే శివాజీ మాటలకి  ప్రాధాన్యమిస్తున్నారు.

ఈ క్రమంలో సినీ నటుడు, రచయిత పోసాని కృష్ణమురళి చేసిన వ్యాఖ్యలు వార్తల్లోకెక్కాయి. జగన్ పై దాడి నేపధ్యంలో జరిగిన చర్చలో పాల్గొన్న పోసాని తెరపైకి కొత్త ఆపరేషన్ ని తీసుకొచ్చారు. పోసాని మాట్లాడుతూ.. ''ఆంధ్రప్రదేశ్ లో ఆపరేషన్ గరుడ జరగబోతుందా..? దాన్ని శివాజీ కనిపెట్టారా..? నాక్కూడా ఓ ఫోన్ వచ్చింది.

ఆ ఫోన్ చేసిన వాడిన పేరు పప్పు.. ఆ ఆపరేషన్ పేరు 'ఆపరేషన్ వెర్రి పువ్వు'... దీన్ని అధికారంలో ఉన్న నాయకులే పులుముకున్నారు. ఈ ఆపరేషన్ లో ముఖ్యమైన అంశం ఏంటంటే.. జగన్ ఉంటే జైలులో ఉండాలా.. లేక ఈ భూమి మీద ఉండకూడదు. శివాజీకి 'ఆపరేషన్ గరుడ'కి ఎలా సోర్స్ వచ్చిందో.. నాకు కూడా అలానే సోర్స్ వచ్చింది.

పప్పు ఎవరో నాకు తెలియదు. ఆయన ఆంధ్రరాష్ట్రానికి చెందిన అధికారంలో ఉన్న ప్రముఖులు ఇందులో ఉన్నారని చెప్పారు. దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే.. మెల్లగా పవన్ క్రేజ్ ని తగ్గించడం,గత ఎన్నికల మాదిరి ఆయన్ని మోసం చేయడం, ప్రత్యేక హోదా ఇస్తానని ముఖ్యమంత్రి మరోసారి జనాన్ని నమ్మిచడం, ఇప్పుడిప్పుడే బయటకి వస్తోన్న జూనియర్ ఎన్టీఆర్ ని ఎలా అడ్డుకోవాలో ఆలోచించడం, అతడిని రాజకీయాల్లోకి రాకుండా ఎలా తొక్కేయాలో.. ఈ వెర్రిపువ్వు ఆపరేషన్ లో భాగమే..'' అంటూ గరుడ ఆపరేషన్ కి కౌంటర్ గా మాట్లాడాడు. 

ఇవి కూడా చదవండి.. 

ఆపరేషన్ గరుడలో నెక్ట్స్ స్టెప్.. మూడు నెలల్లో బాబును కూలదోయడమే: శివాజీ

రాష్ట్రాన్ని తగులబెడుతారా, శివాజీ చెప్పినట్లే జరిగింది: జగన్ మీద దాడిపై బాబు

ఆపరేషన్ గరుడ నిజమైంది, జగన్ ది దిగజారుడు రాజకీయం:అచ్చెన్నాయుడు

జగన్ పై దాడి.. హీరో శివాజీ చెప్పినట్లే జరిగింది

జగన్‌పై వెయిటర్ దాడి: స్పందించిన రెస్టారెంట్ ఓనర్ హర్షవర్దన్