భర్తను వదిలేసి.. బాయ్ ఫ్రెండ్ తో రిలేషన్: బిగ్ బాస్ కంటెస్టెంట్ పూజా!

https://static.asianetnews.com/images/authors/74ce1d03-f84b-5b8e-abc1-c43c5f7c8632.jpg
First Published 31, Aug 2018, 2:48 PM IST
pooja ramachandran about hero married life
Highlights

బిగ్ బాస్ తెలుగు సీజన్ 2 లో వైల్డ్ కార్డు ఎంట్రీ ద్వారా హౌస్ లోకి వచ్చిన పూజా రామచంద్రన్ మొదటి రెండు వారాల్లో చాలా ఎనర్జిటిక్ గా కనిపించింది

బిగ్ బాస్ తెలుగు సీజన్ 2 లో వైల్డ్ కార్డు ఎంట్రీ ద్వారా హౌస్ లోకి వచ్చిన పూజా రామచంద్రన్ మొదటి రెండు వారాల్లో చాలా ఎనర్జిటిక్ గా కనిపించింది. ఆ తరువాత కొంచెం డల్ అయింది. కొద్దిరోజులకే ఆమె ఎలిమినేట్ కావాల్సి వచ్చింది. ఆమె హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చిన సమయంలో సోషల్ మీడియాలో ఆమె వ్యక్తిగత జీవితానికి సంబంధించి రకరకాల వార్తలు వినిపించాయి.

పూజా రెండు పెళ్లిళ్లు చేసుకుందని చాలా మంది ఆమెపై కామెంట్స్ చేశారు. తాజాగా ఈ విషయాలపై క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేసింది పూజా. ఒక వ్యక్తిని ప్రేమించి పెళ్లి చేసుకున్న ఆమె ఆ తరువాత అతడితో విడిపోయినట్లు ప్రస్తుతం తన జీవితంలో మరొకరు ఉన్నట్లు చెప్పింది. సినిమాలోకి రాకముందు పూజా తమిళ ఎస్ ఎస్ మ్యూజిక్ ఛానెల్ లో వీజేగా పని చేసిన సమయంలో క్రెయిగ్ అనే వ్యక్తితో పరిచయమైంది. ఆ పరిచయం ప్రేమగా మారి ఇద్దరూ పెళ్లి కూడా చేసుకున్నారు.

పెళ్ళైన కొంతకాలానికే ఆమె అతడి నుండి విడాకులు తీసుకుంది. ప్రస్తుతం ఇద్దరూ వేరుగా తమ వ్యక్తిగత జీవితాలతో బిజీగా గడుపుతున్నారు. తను క్రెయిగ్ తో ఎందుకు విడిపోవాల్సి వచ్చిందనే విషయాలను పూజా చెప్పడానికి ఇష్టపడలేదు. ప్రస్తుతం ఆమె నటుడు జాన్ తో ప్రేమలో ఉన్నట్లుగా తమిళ మీడియా వర్గాలు చెబుతున్నారు. ఇద్దరూ సహజీవనం చేస్తున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి. 

ఇవి కూడా చదవండి.. 

బిగ్ బాస్2..ఇది నా లైఫ్ అండ్ డెత్ మ్యాటర్

బిగ్ బాస్2: ఈవారం డబుల్ ఎలిమినేషన్.. వెళ్లేది ఆ ఇద్దరేనా..?

బిగ్ బాస్2: కౌశల్ ఆర్మీ టార్గెట్.. గీతా అండ్ శ్యామల..?

బిగ్ బాస్2: కౌశల్ కి గీతా షాక్.. సీజన్ మొత్తం నామినేషన్స్ లో కౌశల్!

loader