బిగ్ బాస్ సీజన్ 2 చివరిదశకు చేరుకుంటోంది. ఈ క్రమంలో హౌస్ లో మరిన్ని ఆసక్తికరమైన టాస్క్ లను ఇస్తూ ప్రేక్షకులకు షోపై మరింత ఇంట్రెస్ట్ క్రియేట్ చేస్తున్నారు. అయితే హౌస్ లో ఎంట్రీ ఇచ్చిన సమయానికి ఇప్పటికీ హౌస్ మేట్స్ చాలా మందిలో మార్పులొచ్చాయి. మొదటి నుండి హౌస్ మేట్స్ కౌశల్ ని సెపరేట్ చేసి చూస్తున్నారు. దీంతో అతడు కూడా వారితో సన్నిహితంగా ఉండకుండా ఒక్కడే గేమ్ ఆడుతున్నాడు.

గత కొద్దిరోజులుగా కౌశల్ హౌస్ మేట్స్ కి దగ్గరైనట్లు కనిపిస్తున్నా.. మళ్లీ హౌస్ మేట్స్ కి కౌశల్ కి మధ్య గొడవలు జరుగుతూనే ఉన్నాయి. గీతామాధురికి కౌశల్ అంటే అసలు పడడం లేదు. అతడిపై ద్వేషాన్ని ఎప్పటికప్పుడు వెళ్లగక్కుతూనే ఉంది. దీంతో ఆమెను కౌశల్ ఆర్మీ టార్గెట్ చేశారు. ఆమెను హౌస్ నుండి బయటకి పంపాలని ప్రయత్నిస్తున్నా వర్కవుట్ కావడం లేదు. కౌశల్ ఓ ఎమోషనల్ అత్యాచారి అంటూ గీతా చేసిన కామెంట్స్ వివాదాస్పదంగా మారాయి. ఇక తాజాగా ఈ సీజన్ మొత్తం ఒక హౌస్ మేట్ ని నామినేట్ చేసే ఛాన్స్ గీతాకి రావడంతో కౌశల్ పేరు చెప్పింది.

దీంతో కౌశల్ ఆర్మీకి ఆమెపై ఆగ్రహం మరింత ఎక్కువైందనే చెప్పాలి. ఇప్పుడు శ్యామలని కూడా కౌశల్ ఆర్మీ టార్గెట్ చేసిందని తెలుస్తోంది. వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా హౌస్ లోకి రీఎంట్రీ ఇచ్చిన శ్యామల మొదట్లో బాగానే ఉన్నా.. రానురాను ఆమె ప్రవర్తనలో మార్పులొస్తున్నాయి. హౌస్ మేట్స్ కి బయట విషయాలు చెప్పి సీక్రెట్ గా వివరిస్తోంది. తాజాగా జరిగిన స్కిట్ లో ఆమె కౌశల్ కి వ్యతిరేకంగా బిగ్ బాస్ తో మాట్లాడింది. ఆమె మాట్లాడిన క్లిప్పింగ్స్ ని కట్ చేసి సోషల్ మీడియాలో వైరల్ చేస్తోంది కౌశల్ ఆర్మీ. శ్యామల నామినేషన్స్ కి వస్తే ఆమెను బయటకి పంపడం ఖాయమని స్పష్టం చేస్తోంది కౌశల్ ఆర్మీ.  

ఇది కూడా చదవండి.. 

బిగ్ బాస్2: కౌశల్ కి గీతా షాక్.. సీజన్ మొత్తం నామినేషన్స్ లో కౌశల్!