బిగ్ బాస్ సీజన్ 2 లో 81వ ఎపిసోడ్ ఆసక్తికరంగానే సాగింది. నిన్నటినుండి జరుగుతోన్న మర్డర్ మిస్టరీ టాస్క్ ఈరోజు కూడా కంటిన్యూ అయింది. ఈ టాస్క్‌లో భాగంగా గణేష్ మర్డర్ మిస్టరీని పసిగట్టే డిటెక్టివ్ పాత్రలో, రోల్ రైడా మర్డర్ మిస్టరీని ఛేదించే పోలీస్ ఆఫీసర్‌గా.. గీతా మాధురి హంతకురాలిగా.. మిగిలిన సభ్యులు పబ్లిక్‌గా వ్యవహరించారు. టాస్క్ లో భాగంగా గీతామాధురి పబ్లిక్ లో ఒక్కొక్కరినీ చంపుతూ రావాలి.

గీతాకు బిగ్ బాస్ కొన్ని సీక్రెట్ టాస్క్ లు కూడా ఇచ్చారు. వాటిని విజయవంతంగా పూర్తి చేస్తే గీతాకు ఎలిమినేషన్ నుండి మినహాయింపు ఉంటుందని.. అంతేకాకుండా మీరు సూచించిన వ్యక్తి ఎలిమినేషన్ లో ఉంటారని ఆఫర్ కూడా ఇచ్చారు. టాస్క్ పూర్తి చేయలేకపోతే మీరు ఎలిమినేషన్ లో ఉంటారని బిగ్ బాస్ గీతాకి చెప్పారు. టాస్క్ లో భాగంగా గీతా ఒక్కొక్కరినీ మట్టుబెట్టడం ఈరోజు ఎపిసోడ్ లో చూపించారు.

డిటెక్టివ్ గణేష్, పోలీస్ ఆఫీసర్ రోల్.. గీతామాధురితో పాటు తనీష్ ని కూడా అనుమానిస్తూ అసలు ఈ హత్యలు ఎవరు చేస్తున్నారనే విషయంలో ఇంకా క్లారిటీకి రాలేదు. అయితే రేపటి ఎపిసోడ్ లో విచారణతో పాటు ఎవరు గెలిచారనే విషయాన్ని బిగ్ బాస్ ప్రకటించనున్నారు. దీనికి సంబంధించిన ప్రోమోలో బిగ్ బాస్ గీతామాధురి గెలిచినట్లుగా, ఆమె ఎవరిని నామినేట్ చేయాలనుకుంటున్నారో.. చెప్పమని అడిగారు. దానికి ఆలోచించిన గీతా.. కౌశల్ పేరు చెప్పింది. దీనిప్రకారం కౌశల్ ఈ సీజన్ మొత్తం ఎలిమినేషన్ కోసం నామినేషన్స్ లో ఉంటారని తెలుస్తోంది. ఇది కౌశల్ కి పెద్ద షాక్ అనే చెప్పాలి.