బిగ్ బాస్2: ఈవారం డబుల్ ఎలిమినేషన్.. వెళ్లేది ఆ ఇద్దరేనా..?

https://static.asianetnews.com/images/authors/74ce1d03-f84b-5b8e-abc1-c43c5f7c8632.jpg
First Published 30, Aug 2018, 2:49 PM IST
bigg boss2: who will eliminate in this week
Highlights

బిగ్ బాస్ సీజన్ 2 సక్సెస్ ఫుల్ గా 80 ఎపిసోడ్లు పూర్తి చేసుకుంది. మొదట్లో షోపై నెగెటివ్ కామెంట్స్ వినిపించినప్పటికీ ఇప్పుడు మాత్రం అందరికీ ఈ షో చేరువైంది. 

బిగ్ బాస్ సీజన్ 2 సక్సెస్ ఫుల్ గా 80 ఎపిసోడ్లు పూర్తి చేసుకుంది. మొదట్లో షోపై నెగెటివ్ కామెంట్స్ వినిపించినప్పటికీ ఇప్పుడు మాత్రం అందరికీ ఈ షో చేరువైంది. 18 మంది కంటెస్టెంట్స్ తో మొదలైన ఈ షో ప్రస్తుతం పది మంది ఇంటి సభ్యులు ఉన్నారు. వారం మొత్తం ఈ కార్యక్రమం ప్రసారం అవుతుండడంతో ప్రతి ఇంట్లోనూ బిగ్ బాస్ సందడి చేస్తోంది. శని, ఆది వారాల్లో నాని తన పెర్ఫార్మన్స్ తో షోని స్పెషల్ ఎట్రాక్షన్ గా మారాడు.

ఇప్పటివరకు హౌస్ నుండి ఎవరు ఎలిమినేట్ కాబోతున్నారనే విషయాలు ముందుగానే లీక్ అవుతూ వచ్చాయి. ఈ షో హైదరాబాద్ లో నిర్వహిస్తుండడం, షో కోసం పని చేసే కొందరు ఔత్సాహికుల కారణంగా ఎలిమినేషన్ విషయాలు ముందుగానే బయటకి వచ్చేసేవి. అయితే ఈ వారం ఎలిమినేషన్ మాత్రం కాస్త ఇంట్రెస్టింగ్ గా సాగుతుందనే చెప్పాలి. ఇప్పటివరకు ఏకగ్రీవంగా ప్రేక్షకులు ఎలిమినేషన్ లో ఒకరి పేరే చెప్పేవారు.

కానీ ఈసారి భిన్నాభిప్రాయాలు వినిపిస్తాయి. ఇక ఇప్పటివరకు వచ్చిన ఓట్లను బట్టి హౌస్ నుండి గణేష్, అమిత్ వెళ్లిపోయే ఛాన్స్ ఉందని సమాచారం. సామ్రాట్, కౌశల్, నూతన్ నాయుడు, గణేష్, అమిత్ లు నామినేషన్స్ లో ఉండగా.. ఓట్లలో కౌశల్ ముందంజలో ఉన్నట్లు తెలుస్తోంది. ఆ తరువాత నూతన్ నాయుడు తరువాతి స్థానంలో సామ్రాట్ ఉన్నట్లు సమాచారం. ఓట్లలో గణేష్, అమిత్ లు వెనుకబడ్డారని తెలుస్తోంది. ఈ వీక్ డబుల్ ఎలిమినేషన్ ఉంటే ఈ  ఇద్దరు బయటకి వచ్చేసేలా ఉన్నారని అంటున్నారు. 

ఇది కూడా చదవండి.. 

బిగ్ బాస్2: కౌశల్ ఆర్మీ టార్గెట్.. గీతా అండ్ శ్యామల..?

బిగ్ బాస్2: కౌశల్ కి గీతా షాక్.. సీజన్ మొత్తం నామినేషన్స్ లో కౌశల్!

loader