తెలుగు రియాలిటీ షో బిగ్ బాస్ 2 చివరి దశకు చేరుకుంది. మరో మూడు వారాల్లో ఈ షో ముగియనుంచి. చివరి దశకు చేరుకునే సమయానికి షో మరింత రసవత్తరంగా సాగుతోంది. ఈ వారం నామినేషన్లలో కౌశల్, సామ్రాట్, నూతన్ నాయుడు, అమిత్, గణేష్ ఉన్న సంగతి తెలిసిందే. కాగా.. వీరిలో ఈ వారం అమిత్, గణేష్ లు బయటకు వెళ్లే అవకాశం ఎక్కువగా కనిపిస్తోంది.

ఇదిలా ఉంటే.. ఈ వారం కెప్టెన్సీ పోటీలో తనిష్, రోల్ రైడా, నూతన్ నాయుడులు పోటీ పడుతున్నారు. ఈ పోటీలో బిగ్ బాస్ ముగ్గురు పోటీ దారులకు సైకిల్స్ ఇచ్చి.. చివరిదాకా ఆపకుండా తొక్కిన వారే విజేతలుగా నిలుస్తారని చెప్పారు.

 

అయితే.. రోల్ రైడా, తనిష్ లు ఇప్పటికే రెండు సార్లు కెప్టెన్ లుగా ఎన్నికయ్యారు. దీంతో నూతన్ నాయుడుకి మద్దతుగా నిలవాలని కౌశల్ భావించాడు. అయితే అనుకోకుండా నూతన్ సైకిల్ చెయిన్ పడిపోయింది. దానిని కౌశల్ సరి చేయడానికి ప్రయత్నిస్తుండగా దీప్తి అడ్డుకుంటున్నట్లు స్టార్ మా విడుదల చేసిన ప్రోమోలో తెలుస్తోంది. ఆ సమయంలో ఇది తనకు లైఫ్ అండ్ డెత్ సమస్య అంటూ నూతన్ ప్రస్తావించారు. మరి కెప్టెన్ ఎవరు అవుతారనే విషయం తెలియాలంటే.. ఈ రోజు ఎపిసోడ్ టెలికాస్ట్ అయ్యేంత వరకు ఆగాల్సిందే.