తెలుగు,తమిళంలో ఎంత పెద్ద గుర్తింపు వచ్చినా...హీరోయిన్స్ కు బాలీవుడ్ వైపే చూపు. ఇక్కడ ఎంత రెమ్యునేషన్ తీసుకుంటున్నా...అక్కడ అతి తక్కువే ఇచ్చినా అటే మ్రొగ్గు చూపెడతారు. ఎందుకంటే బాలీవుడ్ లో చేస్తే జాతీయ స్దాయిలో గుర్తింపు వస్తుందనేది వారి నమ్మకం. అందుకే ఎప్పుడూ ఓ కన్నేసి ఉంచుతారు స్టార్ హీరోయిన్స్. అలాగే సౌత్ లో స్టార్స్ గా వెలుగుతున్నవారిని బాలీవుడ్ ఆహ్వానించి అందలం ఎక్కిస్తూంటుంది. ఇప్పుడు పూజ హెడ్గే కూడా అదే దారిలో ప్రయాణం పెట్టుకుంది. అయితే అది సరికాదు..ఆమె తప్పు చేసింది అంటున్నారు టాలీవుడ్ విశ్లేషకులు.

తెలుగులో వరుస హిట్స్ తో దూసుకుపోతుంది హీరోయిన్ పూజా హెగ్డే. అల్లు అర్జున్ డిజె సినిమాతో తెలుగులో రీ ఎంట్రీ ఇచ్చిన పూజా ఇప్పుడు టాలీవుడ్ స్టార్ హీరోయిన్లలో టాప్ ప్లేస్ లో కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఎన్టీఆర్ తో అరవింద సమేత వీర రాఘవ, మహేశ్ బాబుతో మహర్షి, బన్నీతో అల..వైకుంఠపురంలో చిత్రాల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. ప్రస్తుతం పూజా హెడ్గే ప్రస్తుతం అఖిల్ మోస్ట్ బ్యాచిలర్ మూవీతో పాటు ప్రభాస్ జాన్ సినిమాలో నటిస్తుంది. దీంతో పాటు బాలీవుడ్ లో మరో బంపర్ ఆఫర్ కొట్టేసింది పూజా.

బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ సరసన నటించటానికి కమిటైంది. ఇప్పటికే బాలీవుడ్‌లో హృతిక్ రోషన్‌తో ‘మొహంజోదారో’.. అక్షయ్‌ కుమార్‌తో ‘హౌస్‌ఫుల్‌-4’లో నటించింది. అయితే ఆ రెండు సినిమాలు వర్కవుట్ కాలేదు. దాంతో మరో సారి ట్రైల్ వేస్తోంది.  సల్మాన్‌ ఖాన్‌ హీరోగా ఫర్హద్‌ సంజీ తెరకెక్కిస్తున్న ‘కబీ ఈద్‌ కబీ దివాళి’ సినిమాలో పూజా హెగ్డే హీరోయిన్‌గా నటిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్‌ అక్టోబర్‌లో ప్రారంభం కానుంది. 2021 ఈద్‌ కానుకగా ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. మరోసారి బాలీవుడ్ లో తన అదృష్టాన్ని పరిక్షించుకోనుంది పూజా. అందుకోసం ఆమె తన రెమ్యునేషన్ ని సైతం బాగా తగ్గించుకుంది. ఇది టాలీవుడ్ హీరోలకు ఒళ్లు మండించే విషయం కాబట్టి దూరం పెట్టే  అవకాసం ఉందంటున్నారు.

అయితే తెలుగులో ఓ వెలుగు వెలుగుతున్న ఈ సమయంలో పూజ హెడ్గే..ఇలా బాలీవుడ్ కు డేట్స్ కేటాయించటం వల్ల ..ఇక్కడ దూరం అవుతుంది. తెలుగుపై కాన్సర్టేషన్ తగ్గుతుంది అంటున్నారు. అలాగే సల్మాన్ తో హిట్ పడితే అక్కడ బిజి అవ్వటానికి ప్రయత్నాలు మొదలెడుతుంది. కానీ బాలీవుడ్ లో ఆఫర్స్ అంటే అంత ఈజి కాదు. కాబట్టి కాస్త ఆలోచించుకుని అటు వైపు వెళ్తే బెస్ట్ అంటున్నారు. అంతగా కాకపోతే సౌత్ నుంచి వెళ్లిన అసిన్, ఇలియనా, త్రిష వంటివారిని సలహా అడగమంటున్నారు.