అమీర్ ఖాన్, అమితాబ్ బచ్చన్ ప్రధాన పాత్రల్లో నటించిన 'థగ్స్ ఆఫ్ హిందుస్తాన్' సినిమా విడుదలైన కొద్ది గంటల్లోనే ఆన్ లైన్ లో ప్రత్యక్షమైంది. విజయ్ కృష్ణ ఆచార్య డైరెక్ట్ చేసిన ఈ సినిమాలో కత్రినా కైఫ్, ఫాతిమా సనా ఖాన్ హీరోయిన్లుగా నటించారు.

దీపావళి కానుకగా గురువారం నాడు ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది. మొదటి షోతోనే ఈ సినిమాకి నెగెటివ్ టాక్ రావడంతో అభిమానులు నిరాశ చెందారు. పెట్టిన పెట్టుబడి వస్తుందా..? రాదా..? అని ఆలోచనలో పడ్డ బయ్యర్లకు, నిర్మాతలకు పైరసీ రూపంలో మరో షాక్ తగిలింది.

తమిళరాకర్స్ అనే వెబ్ సైట్ లో 'థగ్స్ ఆఫ్ హిందుస్తాన్' సినిమా ప్రింట్ వచ్చేసింది. తమిళనాడుకి చెందిన ఈ వెబ్ సైట్ లో తెలుగు, మలయాళంతో పాటు ఇతర భాషల సినిమాలను కూడా పైరసీ చేస్తుంటారు. 

ఈ విషయంపై తమిళ సినీ నిర్మాతల సంఘానికి 'థగ్స్ ఆఫ్ హిందుస్తాన్' చిత్ర యూనిట్ సభ్యులు ఫిర్యాదు చేశారు. సదరు వెబ్ సైట్ నిర్వాహకులపై వెంటనే చర్యలు తీసుకోవాలని కోరారు. ఇటీవల ఈ వెబ్ సైట్ లో తమిళ హీరో విజయ్ నటించిన 'సర్కార్' సినిమాని కూడా పైరసీ చేసి పెట్టేశారు.   

ఇవి కూడా చదవండి.. 

బాహుబలి రికార్డ్ కి 'థగ్స్ ఆఫ్ హిందూస్థాన్' బ్రేక్!

'థగ్స్ ఆఫ్ హిందూస్తాన్' కంటే ఆ సినిమాలే బెటర్.. నెటిజన్ల ట్రోలింగ్!

'థగ్స్ ఆఫ్ హిందూస్తాన్' ట్విట్టర్ రివ్యూ!

'థగ్స్‌ ఆఫ్‌ హిందుస్థాన్‌' మూవీ రివ్యూ