బాలీవుడ్ మిస్టర్ పెర్ఫెక్షనిస్ట్ అమీర్ ఖాన్ నటించిన 'థగ్స్ ఆఫ్ హిందూస్తాన్' చిత్రం ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. దాదాపు రూ.300 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమా ఫ్లాప్ అవుతుందని ఎవరూ ఊహించి ఉండరు. 

కానీ ప్రేక్షకులతో పాటు, బాలీవుడ్ మీడియా ఏకగ్రీవంగా ఈ సినిమా ఫ్లాప్ అని తేల్చేసింది. దీంతో ఈ సినిమాపై సోషల్ మీడియాలో ట్రోలింగ్ ఓ రేంజ్ లో జరుగుతోంది. సినిమా కోసం ఇంతకాలం ఎదురుచూసి థియేటర్ కి వెళ్లిన ప్రేక్షకుడు సినిమా చూస్తున్నంతసేపు తాము పడ్డ బాధను ఫన్నీ మీమ్స్ రూపంలో తెలియజేస్తున్నారు.

బాలీవుడ్ లో అతి పెద్ద డిజాస్టర్ లైన ట్యూబ్ లైట్, రేస్ త్రీ సినిమాలు ఈ సినిమా కంటే చాలా బెటర్ అని ట్రోల్ చేస్తున్నారు. సినిమాలకు పాజిటివ్ రివ్యూలు ఇచ్చే ట్రేడ్ అనలిస్ట్ తరణ్ ఆదర్శ్ కూడా ఈ సినిమాకి నెగెటివ్ రివ్యూ ఇచ్చాడంటే ఇక సినిమా పరిస్థితి ఎంత అద్వాన్నంగా ఉందనే విషయం అర్ధమవుతోంది.

అందుకే ఈ సినిమాని హ్రితిక్ రోషన్ రిజక్ట్ చేసి ఉంటాడని కామెంట్స్ పెడుతున్నారు. ఇలాంటి కథను అమీర్ ఖాన్ ఎలా ఒప్పుకొని ఉంటాడని అభిమానులు బాధ పడుతూనే.. షారుఖ్, సల్మాన్ ఫ్యాన్స్ కావాలని నెగెటివ్ రివ్యూలు ఇస్తున్నారని తమ అభిమాన హీరో సినిమాని సపోర్ట్ చేస్తున్నారు. మొత్తానికి కలెక్షన్ల సునామీ సృష్టిస్తుందనుకున్న సినిమా కాస్త రెండు రోజులకే చతికిల పడేలా ఉంది! 

ఇవి కూడా చదవండి.. 

'థగ్స్ ఆఫ్ హిందూస్తాన్' ట్విట్టర్ రివ్యూ!

'థగ్స్‌ ఆఫ్‌ హిందుస్థాన్‌' మూవీ రివ్యూ