ఫ్లాప్ టాక్ తెచ్చుకున్న సినిమా బాహుబలి రికార్డులను ఎలా బద్దలు కొట్టిందని ఆలోచిస్తున్నారా..? పోనీలెండి కనీసం ఆ ఒక్క ఆనందమైనా అమీర్ ఖాన్ దక్కిందని అనుకుందాం. అసలు విషయంలో వస్తే అమీర్ నటించిన 'థగ్స్ ఆఫ్ హిందూస్థాన్' నిన్న విడుదలైన సంగతి తెలిసిందే. 

ఈ సినిమాకి మొదటిషో నుండే నెగెటివ్ టాక్ వచ్చింది. ఈ వీకెండ్ దాటితే సినిమా పరిస్థితి ఏంటనేది కూడా అర్ధంకాని స్థితిలో ఉన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో కూడా అమీర్ ఖాన్ తొలిరోజు వసూళ్లలో బాహుబలి2 సినిమానుఅధిగమించాడు. మొదటిరోజు వసూళ్లలో ఇండియాలో బాహుబలి2 దే హవా. 

దాదాపు ఐదు వేల స్క్రీన్ లలో విడుదలైన ఈ సినిమా మొదటిరోజు రూ.40 కోట్ల 73 లక్షలు వసూలు చేసింది. ఇప్పుడు ఈ రికార్డ్ ను 'థగ్స్ ఆఫ్ హిందూస్థాన్'బ్రేక్ చేసింది. ఆరు వేలకి పైగా స్క్రీన్ లలో విడుదలైన ఈ సినిమా మొదటిరోజు 52 కోట్ల 25 లక్షలు రాబట్టింది. విడుదలకి ముందే ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొనడంతో అడ్వాన్స్ బుకింగ్స్ ఓ రేంజ్ లో జరిగాయి.

ఆ కారణంగానే భారీ స్థాయిలో కలెక్షన్స్ వసూలు అయ్యాయి. దీంతో ఇప్పుడు తొలిరోజు వసూళ్లలో మొదటి స్థానంలో 'థగ్స్ ఆఫ్ హిందూస్థాన్' ఉండగా రెండో స్థానంలో బాహుబలి2 ఆ తరువాత సల్మాన్ ఖాన్ 'ప్రేమ్ రథన్ ధన్ పాయో' సినిమాలు ఉన్నాయి. అయితే సినిమాకి నెగెటివ్ టాక్ రావడంతో ఇప్పుడు బయ్యర్లకు నష్టాలు తప్పేలా లేవు!

ఇవి కూడా చదవండి.. 

'థగ్స్ ఆఫ్ హిందూస్తాన్' కంటే ఆ సినిమాలే బెటర్.. నెటిజన్ల ట్రోలింగ్!

'థగ్స్ ఆఫ్ హిందూస్తాన్' ట్విట్టర్ రివ్యూ!

'థగ్స్‌ ఆఫ్‌ హిందుస్థాన్‌' మూవీ రివ్యూ