Asianet News TeluguAsianet News Telugu

'థగ్స్‌ ఆఫ్‌ హిందుస్థాన్‌' మూవీ రివ్యూ

అమీర్ ఖాన్, అమితాబ్ వీళ్ళిద్దరు తెలుగు సినిమాల్లో హీరోలుగా చేయకపోయినా..ఇక్కడ అందరికీ తెలుసు. వాళ్ల సినిమాలు హిందీ అయినా చూసి ఎంజాయ్ చేస్తూంటారు. అలాంటిది వీళ్లిద్దరు కలిసి సినిమా చేస్తూ..దాన్ని తెలుగులో డబ్బింగ్ చేస్తే,వాళ్లు తెలుగులో డైలాగులు చెప్తూంటే ...ఆ మజానే వేరు. ఈ  కాంబోకు కత్రినా కైఫ్ కూడా కలిసి వచ్చింది.

thugs of hindusthan movie review
Author
Hyderabad, First Published Nov 8, 2018, 2:58 PM IST

--సూర్య ప్రకాష్ జోశ్యుల

అమీర్ ఖాన్, అమితాబ్ వీళ్లిద్దరూ తెలుగు సినిమాల్లో హీరోలుగా చేయకపోయినా.. ఇక్కడ అందరికీ తెలుసు. వాళ్ల సినిమాలు హిందీ అయినా చూసి ఎంజాయ్ చేస్తూంటారు. అలాంటిది వీళ్లిద్దరు కలిసి సినిమా చేస్తూ..దాన్ని తెలుగులో డబ్బింగ్ చేస్తే,వాళ్లు తెలుగులో డైలాగులు చెప్తూంటే ...ఆ మజానే వేరు. ఈ  కాంబోకు కత్రినా కైఫ్ కూడా కలిసి వచ్చింది. దాంతో భారీ సెటప్ తో బ్రిటీష్ వాళ్ల కాలం నాటి కథతో వస్తున్నప్పుడు ఖచ్చితంగా చూడాలనిపిస్తుంది.  ఈ నేపధ్యంలో సినిమాపై మంచి అంచనాలే ఏర్పడ్డాయి. వాటిని ఈ సినిమా అందుకుందా...? ఈ కాంబినేషన్ లో చేసేటంత ఉత్సాహం తెప్పించిన కథ ఏమిటి...? సినిమా హిట్ అవుతుందా..? మన తెలుగు జనాలకు నచ్చుతుందా..? టైటిల్ ని ‘థగ్స్‌ ఆఫ్‌ హిందుస్థాన్‌’ అని ఎదుకు పెట్టారు వంటి విషయాలు రివ్యూలో చూద్దాం.

కథేంటి

అది 1795. బ్రిటీష్ వాళ్లు..భారతదేశాన్ని పూర్తిగా ఆక్రమించుకుంటున్న పీరియడ్. సంస్దానాలు, రాజ్యాలు హస్తగతం చేసుకుంటున్న వాళ్లకు ఎదురేలేకుండా పోతుంది. ఎవరైనా ఎదురుతిరిగితే చాలా దుర్మార్గంగా వ్యవరిస్తూంటారు. ఆ సమయంలో... ఏరు దాటే దాకా ఓడ మల్లయ్య ఏరు దాటాక బోడి మల్లయ్య లాంటి క్యారక్టర్.. ఫిరంగి మల్లయ్య (అమీర్ ఖాన్) ది. అతను నక్క జిత్తులతో ఎవరినైనా బోల్తా కొట్టిస్తూంటాడు. 

ఎప్పుడు ఏ ఎత్తు వేసి.. ఎదుటివారిని చిత్తు చేస్తాడో ... ఆ క్షణం దాకా అతనికి కూడా తెలియదు. ఇలాంటి మల్లయ్య..తన తెలివిని నమ్ముకుని బ్రిటీష్ వాళ్లకు తొత్తుగా మారి డబ్బులు సంపాదించుకుంటూంటాడు. థగ్స్ (దారి కాచి దోపిడీలు చేసే దొంగలు)తో స్నేహం చేసినట్లు నటించి..వారిని పట్టిస్తూ ఈనాములు కొట్టేస్తూంటాడు.  ఇంత తెలివైన వాడిని, సాహసిని.. స్వాతంత్య్ర ఉద్యమం చేసేవారిపై ప్రయోగిస్తే ఎలా ఉంటుంది అనే ఆలోచన బ్రిటీష్ వాళ్లకు వస్తుంది. 

ఆ సమయంలో.. ఖుదాబక్ష్(అమితాబ్‌ బచ్చన్‌) బ్రిటీష్ వారికి వ్యతిరేకంగా ఉద్యమిస్తూంటాడు. అతన్ని పట్టుకోవాలి అంటే మల్లయ్యని ప్రయోగించాలనుకుంటారు.  డబ్బుకు ఆశపడి మల్లయ్య కూడా ఓకే అంటాడు. తన తెలివితో మెల్లిగా ఖుదాబక్ష్(అమితాబ్‌ బచ్చన్‌) దళంలో జాయిన్ అవుతాడు. అంతేకాదు ఖుదాబక్ష్(అమితాబ్‌ బచ్చన్‌)  నమ్మకాన్ని సైతం పొందుతాడు. టైమ్ చూసి ఖుదాబక్ష్(అమితాబ్‌ బచ్చన్‌) ని పట్టిస్తాడు. 

కానీ ఈ లోగా ఖుదాబక్ష్(అమితాబ్‌ బచ్చన్‌) లోని మంచితనం, స్వాతంత్ర్య కాంక్ష చూసి అచ్చమైన హిందుస్తాన్ గా మారతాడు. అక్కడ నుంచి ఖుదాబక్ష్(అమితాబ్‌ బచ్చన్‌) ని, ఆయన్ని దళాన్ని ఎలా కాపాడతాడు. బ్రిటీష్ వాళ్లకు అనుమానం రాకుండా ఎత్తుకు పై ఎత్తులు వేసి వారిని ఎలా చిత్తు చేసాడు, కత్రినా కైఫ్ పాత్ర ఏమిటి... అన్నది తెరపై చూడాల్సిన కథ. 

కెప్టెన్ జాక్ స్పారో నే కానీ ...

'పైరేట్స్ ఆఫ్ ది కరేబియన్'  సినిమాలో పాత్రలను, వాటి గెటప్ లను గుర్తు చేస్తూ ఈ సినిమా సాగింది. దర్శకుడు ఆ సినిమాని దగ్గర పెట్టుకుని.. స్వాతంత్ర్య పోరాటాన్ని కలుపుతూ ఓ కథ అనుకున్నారు. బేస్ గా ..1839లో వచ్చిన ‘కన్‌ఫెషన్స్‌ ఆఫ్‌ ది థగ్‌’ అనే నవలను ఎంచుకున్నారు. అంతవరకూ బాగానే ఉంది కానీ.. కథ,కథనం దగ్గరకి వచ్చేసరికే దర్శక,రచయిత అలిసిపోయారు. సినిమాలో ఫైట్స్ ,విజువల్ ఎఫెక్ట్స్ పై పెట్టిన శ్రద్ద స్క్రీన్ ప్లే మీద పెట్టలేదు. 

దాంతో కథ నెమ్మిదిగా సాగుతుంది. ఎక్కడా సినిమాలో ఉషారు అనేది ఉండదు. తెరపై విజువల్స్ కదిలిపోతూంటాయి కానీ మనలో ఏ విధమైన ఎమోషన్ రగిలించలేకపోతాయి. దానికి కారణం..దర్శకుడు కీ క్యారక్టర్స్ అమితాబ్, అమీర్ ఖాన్ లను ప్రెజెంట్ చేసిన తీరే. సినిమా ప్రారభమైన అరగంటకే మనకు కథ మొత్తం క్లైమాక్స్ తో సహా అర్దమైపోతుంది.  దాంతో ఆ కథని ఇంతలా అర్దమయ్యే ఈ కథని ఎంత ఇంట్రస్ట్ గా చెప్తాడు అని ఎదురుచూస్తాం. అయితే అంత సీన్ లేదని మనకు అర్దమైపోతుంది. 

ముఖ్యంగా అమీర్ ఖాన్ చేసిన ఫిరంగి మల్లయ్య పాత్ర... 'పైరేట్స్ ఆఫ్ ది కరేబియన్'  లో కెప్టెన్ జాక్ స్పారోకు నకలులా ఉంటుంది. ఆ నక్క జిత్తులు అవీ బాగుంటాయి. కానీ వాటిని ప్రెజెంట్ చేసే అవకాశమే కథ ఇవ్వదు. అలాగే..ఆ పాత్ర సినిమాలో ఎక్కడైనా ఇరుక్కుపోతాడేమో, సమస్య వస్తుందని అనుకుంటాం. కానీ ఆ పాత్రకు సమస్య అనేదే ఉండదు. సమస్య లేని పాత్ర తో కథ నడపటం పెద్ద సమస్యలో పడేస్తుంది. అదే ఇక్కడా జరిగింది. సమస్య లేకపోవటంతో.. సరైన కాన్ఫ్లిక్ట్ లేక డ్రామా పుట్టలేదు. దాంతో బోర్ కొట్టడం మొదలైంది.

టెక్నికల్ గా ..

ఇక ఈ సినిమా  పాటలు తెలుగులో పెద్దగా బాగోలేవు. బ్యాక్ గ్రౌండ్ స్కోర్, సీజీఐ వర్క్‌, సెట్స్‌ బాగున్నాయి. యశ్‌రాజ్‌ ఫిలింస్‌ కూడా డబ్బుని నీళ్లులా పోసి ... సినిమాకు రిచ్ లుక్ తెచ్చింది.  తెలుగు డబ్బింగ్ డైలాగ్స్ ఓకే. అమీర్ ఖాన్ కు డబ్బింగ్ ఎవరు చెప్పారో కానీ.. ఆయన బాడీ లాంగ్వేజ్ కు వాయిస్ కుదరలేదు. 

రొమాన్స్ లేదు

బాహుబలి లాంటి సినిమాకు ఈ సినిమాలకు తేడా ఏంటంటే...బాహుబలిలో ఫన్, రొమాన్స్ వంటివాటికి కూడా సరైన స్దానం ఉంటుంది. కేవలం యాక్షన్ ఎపిసోడ్స్ నమ్మి సినిమా చేయలేదు. కానీ ఈ సినిమాలో అదే లోపించింది. హీరోయిన్ లేదు..రొమాన్స్ లేదు. చాలా డ్రైగా సినిమా వెళ్తూంటుంది. 

డైరక్షన్  పై డౌట్

ఈ సినిమా చూస్తూంటే.. ధూమ్‌ లాంటి సినిమాకు  కథలను అందించిన విజయ్‌ కృష్ణ ఆచార్య డైరక్ట్ చేసిన సినిమాయేనా అని డౌట్ వస్తుంది. సీరియల్ వాతావరణం కనపడుతుంది. టీవిలో వచ్చే ఝాన్సీ లక్ష్మీబాయి సీరియల్ చూస్తున్న ఫీల్ వస్తుంది.

ఫైనల్ ధాట్
 
అమీర్ ఖాన్ మాత్రం కథ ఎలా ఉన్నా.. తన క్యారక్టర్ లోకి పరకాయ ప్రవేశం చేస్తాడు అని మరోసారి ప్రూవ్ అయ్యింది.  

రేటింగ్: 2/5 

ఎవరెవరు

నటీనటులు: అమితాబ్‌ బచ్చన్‌, ఆమిర్‌ ఖాన్‌, కత్రినా కైఫ్‌, ఫాతిమా సనా షేక్‌ తదితరులు

సంగీతం: అజయ్‌, అతుల్‌

సినిమాటోగ్రఫీ: మానుశ్‌ నందన్‌

కూర్పు: రితేశ్‌ సోని

నిర్మాణ సంస్థ: యశ్‌రాజ్‌ ఫిలింస్‌

కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: విజయ్‌ కృష్ణ ఆచార్య

విడుదల తేదీ: 08-11-2018 

Follow Us:
Download App:
  • android
  • ios