బాలీవుడ్‌లోని  ఇతర నటీనటుల్లా నా మృతి కూడా ఓ మిస్టరీగా మారిపోయేలా ఉంది. ఆ మాఫియా గ్యాంగ్‌ నన్ను చంపేస్తుంది. నా చావుని ఆత్మహత్యగా ఆ  గ్యాంగ్‌ చిత్రీకరిస్తుంది. కాబట్టి ప్రధాని నరేంద్రమోదీజీ, అమిత్‌ షాజీ దయచేసి నాకు సాయం చేయండి’ అంటూ పాయల్‌ సంచలన వ్యాఖ్యలు చేశారు.   బాలీవుడ్‌ దర్శకుడు అనురాగ్‌ కశ్యప్‌ తన పట్ల అసభ్యంగా ప్రవర్తించాడని ఆరోపణలు చేస్తూ పాయల్‌ ఇటీవల  ముంబయిలోని ఓ పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. అంతేకాకుండా ‘నాతో రిచా చద్దా అత్యంత సన్నిహితంగా ఉంటుంది’ అని అనురాగ్‌ తనతో చెప్పారని నటి పాయల్‌ అన్నారు. ఆ తర్వాత ఆ విషయమై క్షమాపణ తెలియచేసారు.
 
పాయల్‌ ఆరోపణలతో తన పరువుకి ఇబ్బంది వాటిల్లిందని పేర్కొంటూ ఇటీవల నటి రిచాచద్దా బాంబే కోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. ఈ క్రమంలోనే నటి పాయల్‌ ఘోష్‌ జాతీయ మహిళా కమిషన్‌ చైర్‌పర్సన్‌ రేఖా శర్మను మంగళవారం కలిశారు. దీనికి సంబంధించిన ఫొటోలను సోషల్‌మీడియాలో పోస్ట్‌ చేశారు. సదరు ఫొటోలు చూసిన రిచా.. ‘రేఖ మేడమ్‌.. దర్శకుడి గురించి ఆరోపణలు చేసే సమయంలో.. నా పేరుని కావాలనే పాయల్‌ బయటపెట్టారని చెబుతూ గతనెలలో నేను ఎన్సీడబ్ల్యూలో ఫిర్యాదు చేశాను. కానీ ఇప్పటివరకూ సదరు ఫిర్యాదు గురించి నేను ఎలాంటి సమాధానం పొందలేదు’ అని ట్వీట్‌ చేశారు.
 
కాగా, రిచాచద్దా పెట్టిన ట్వీట్‌పై తాజాగా పాయల్‌ స్పందించారు. ‘రిచా చద్దా.. నిజాలు బయటకు రాకుండా మిమ్మల్ని కావాలనే ఈ ఫిర్యాదులో భాగం చేశానని ఎలా చెప్పగలరు? కశ్యప్‌ గురించి మీరు అంత నమ్మకంగా ఎలా మాట్లాడగలుగుతున్నారు? రేఖ మేడమ్‌ దయచేసి దీని గురించి ఒక్కసారి ఆలోచించండి. ఈ మొత్తం గ్యాంగ్‌  కలిసి నన్ను అవమానించాలని చూస్తోంది.  సుశాంత్‌లా నేను కూడా చనిపోవాలని వాళ్లు భావిస్తున్నారు అందుకే ఇప్పటివరకూ నా ఫిర్యాదుకి సమాధానం ఇవ్వలేదు. కాబట్టి ప్రధాని నరేంద్రమోదీజీ, అమిత్‌ షాజీ దయచేసి నాకు సాయం చేయండి’ అంటూ పాయల్‌ సంచలన వ్యాఖ్యలు చేశారు.