Asianet News TeluguAsianet News Telugu

`భీమ్లా నాయక్‌` టైటిల్‌ సాంగ్‌.. పవర్‌ స్టార్‌ ఫ్యాన్స్ కి బర్త్ డే గిఫ్ట్

పోలీస్‌ గెటప్‌లో, లుంగీ కట్టి పవన్‌ చేసిన హంగామాకి ఫ్యాన్స్ ఊగిపోయారు. ఈ నేపథ్యంలో ఈ సినిమా నుంచి మరో ట్రీట్‌ రాబోతుంది. పవన్‌ కళ్యాణ్‌ బర్త్ డే సందర్భంగా ఈ చిత్రంలోని పాటని విడుదల చేయబోతున్నారు. 
 

pawan kalyan starrer bhemla nayak title song on september 2nd
Author
Hyderabad, First Published Aug 30, 2021, 7:08 PM IST

పవన్‌ కళ్యాణ్‌ నటిస్తున్న తాజా చిత్రం `భీమ్లా నాయక్`. రానా మరో కీలక పాత్ర పోషిస్తున్న ఈ సినిమాకి సాగర్‌ కె చంద్ర దర్శకత్వం వహిస్తున్నారు. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్‌ మాటలు, స్క్రీన్‌ ప్లే అందిస్తున్నారు. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్నారు. మలయాళ సూపర్‌ హిట్‌ మూవీ `అయ్యప్పనుమ్‌ కోషియుమ్‌`కిది రీమేక్‌. 

ఇందులో పవన్‌ సరసన నిత్యా మీనన్‌, రానా సరసన ఐశ్వర్యా రాజేష్‌ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఇటీవల విడుదలైన ఈ చిత్ర ఫస్ట్ లుక్‌, టీజర్‌ లకు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. పోలీస్‌ గెటప్‌లో, లుంగీ కట్టి పవన్‌ చేసిన హంగామాకి ఫ్యాన్స్ ఊగిపోయారు. ఈ నేపథ్యంలో ఈ సినిమా నుంచి మరో ట్రీట్‌ రాబోతుంది. పవన్‌ కళ్యాణ్‌ బర్త్ డే సందర్భంగా ఈ చిత్రంలోని పాటని విడుదల చేయబోతున్నారు. 

`భీమ్లా నాయక్‌` చిత్రంలోని టైటిల్‌ సాంగ్‌ని పవన్‌ బర్త్ డే సందర్భంగా సెప్టెంబర్‌ 2న రిలీజ్‌ చేయబోతున్నారు. 11.06గంటలకు ఈ సాంగ్‌ని రిలీజ్‌ చేయబోతున్నట్టు చిత్ర బృందం ప్రకటించింది. ఈ మేరకు ఓ పోస్టర్‌ని రిలీజ్‌ చేశారు. టేబుల్‌పై గన్‌ పెట్టిన పోస్టర్‌ ఆద్యంతం ఆకట్టుకుంటోంది. పవన్‌ అభిమానులకు పర్‌ఫెక్ట్ గిఫ్ట్ గా ఉండబోతుందనే సిగ్నల్స్ ఇచ్చారు. ఇప్పటికే ఈ సినిమాకి సంబంధించి ఆడియో రైట్స్ ని ఆదిత్య మ్యూజిక్‌ భారీ రేటుకి దక్కించుకున్న విషయం తెలిసిందే. ఇక సినిమాని అన్ని కార్యక్రమాలు పూర్తి చేసి వచ్చే సంక్రాంతి కానుకగా జనవరి 12న విడుదల చేయబోతున్నారు.

Follow Us:
Download App:
  • android
  • ios