- Home
- Entertainment
- Nagarjuna తో పోటీకి దిగి.. బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన అల్లరి నరేష్, ఇంతకీ ఆమూవీ ఏదో తెలుసా?
Nagarjuna తో పోటీకి దిగి.. బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన అల్లరి నరేష్, ఇంతకీ ఆమూవీ ఏదో తెలుసా?
పెద్ద హీరోలతో పోటీ పడాలంటే చిన్న హీరోలు భయపడతారు. కానీ కెరీర్ బిగినింగ్ లోనే అల్లరి నరేష్ నాగార్జున సినిమాకు పోటీగా తన సినిమాను రిలీజ్ చేశాడు. కావాలని చేయకపోయినా.. అనుకోకుండా జరిగిన ఈ పోటీలో ఎవరు గెలిచారు? ఆ సినిమా ఏంటి?

అల్లరి నరేష్ కెరీర్..
తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో పోటీని తట్టుకుని నిలబడ్డ హీరోలలో అల్లరి నరేష్ ఒకరు. తనకంటూ ప్రత్యేకమైన స్థానం సాధించిన హీరో అల్లరి నరేష్. రాజేంద్ర ప్రసాద్ తరువాత టాలీవుడ్ కు దొరికిన అరుదైన కామెడీ హీరో ఆయన. హీరోగా ఎంట్రీ ఇచ్చి.. కామెడీ సినిమాలు చేసుకుంటూ.. వరుస సక్సెస్ లతో దూసుకుపోయాడు అల్లరి నరేష్ .. చాలా తక్కువ టైమ్ లోనే 50 సినిమాలు కంప్లీట్ చేశాడు. ఇక ఈమధ్య కాలంలో కామెడీ పాత్రలు వదిలి సీరియస్ సబ్జెక్ట్స్ ను తీసుకుని హిట్లు కొడుతున్నాడు. ఫ్యామిలీ ఆడియన్స్ టార్గెట్ గా సినిమాలు చేస్తూ వచ్చిన నరేష్.. తన కామెండీ టైమింగ్ తో అడుపుబ్బా నవ్వించాడు. ఆతరువాత కాలంలో అల్లరి నరేష్ సినిమాలు పెద్దగా ఆకట్టుకోలేకపోయాయి.
నాగార్జున సినిమాతో పోటీ
అల్లరి నరేష్ ఫస్ట్ సినిమాతోనే హిట్ కొట్టాడు. రవిబాబు డైరెక్షన్ లో అల్లరి సినిమాతో టాలీవుడ్ కు పరిచయం అయ్యాడు నరేష్. రవిబాబు డైరెక్షన్ చాలా డిఫరెంట్ గా ఉంటుంది. ఆయన సబ్జెక్ట్స్ , స్క్రీన్ ప్లే అందరికింటే డిఫరెంట్ గా కనిపిస్తుంది. ఈక్రమంలో ఈసినిమా హిట్ అవుతుందా లేదా అని అంతా అనుకున్నారు. అంతే కాదు సరిగ్గా అల్లరి సినిమా టైమ్ లోనే కింగ్ నాగార్జున సంతోషం సినిమా రిలీజ్ అయ్యింది. అప్పుడు నాగార్జున మంచి ఫామ్ లో ఉన్నారు. అటువంటి టైమ్ లో.. నరేష్ ఫస్ట్ సినిమా అల్లరి రిలీజ్ అయ్యింది. సంతోషం మే 9న రిలీజ్ అయితే.. అల్లరి సినిమా మే 10 న రిలీజ్ అయ్యింది. పోటీ అని కాదు కానీ.. రెండు సినిమాలు బాక్సాఫీస్ దగ్గర మంచి ఫలితాన్ని సాధించాయి.
రిజల్ట్ గురించి టెన్షన్ పడ్డ అల్లరి నరేష్
అల్లరి సినిమా విషయంలో నరేష్ చాలా టెన్షన్ పడ్డాడు. ఈ విషయాన్ని చాలా ఇంటర్వ్యూలలో ఆయన వెల్లడించారు. నరేష్ మాట్లాడుతూ.. '' ఫస్ట్ సినిమా రిలీజ్, ఎలా వచ్చిందో ఏంటో తెలియదు. సినిమాను ప్రివ్యూ కోసం రవిబాబు, సురేష్ బాబు, నాన్నగారు కూర్చున్నారు. నాకు మాత్రం టెన్షన్ పెరిగిపోయింది. ఏం జరుగుతుందో ఏంటో అని. పైగా నాగార్జున సంతోషం సినిమా కూడా అప్పుడే రిలీజ్ కు ఉంది. అంత పెద్ద సినిమా ముందు అల్లరి నిలబడుతుందా లేదా.. ఏం చేయాలో తెలియని పరిస్థితి. కానీ సినిమా హిట్ అయిన తరువాత చాలా సంతోషం అనిపించింది'' అని నరేష్ అన్నారు.
యాక్టింగ్ వద్దు అనుకున్న ఈవివి
అల్లరి నరేష్ మాట్లాడుతూ..'' నేను యాక్టర్ ను అవ్వడం నాన్నగారికి ఇష్టం లేదు. నాకు ఆ విషయం తరువాత తెలిసింది. అల్లరి సినిమా ప్రీవ్యూ చూసి వచ్చిన తరువాత నాతో ఏం చెప్పలేదు కానీ..అమ్మతో మాట్లాడారట. నేను చేయగలనా లేదా అని భయం ఆయనకు ఉండేది. అందుకే నన్ను యాక్టింగ్ స్కూల్ కు కూడా వెళ్లమని చెప్పారు. కానీ అల్లరి సినిమా చూసిన తరువాత ఆ సినిమా క్లైమాక్స్ చూసి చాలా సంతోషపడ్డారు. అంత పెద్ద సీన్.. పైగా ఎమోషనల్ డైలాగ్స్ ను ఒక్క రోజులో షూట్ చేశారు. చాలా బాగా చేశాడు. ఇంత మంచిగా నటిస్తాడని నేను అనుకోలేదు అని అమ్మతో అన్నారట. అప్పుడు నాపై నాన్నగారికి నమ్మకం వచ్చింది. '' అని అల్లరి నరేష్ అన్నారు.

