బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుట్ కేసును విచారించేందుకు సీబీఐ అక్కర్లేదన్నారు మహారాష్ట్ర హోంమంత్రి అనిల్ దేశ్‌‌ముఖ్. కేసును విచారించే సమర్థత ముంబై పోలీసులకు ఉందని ఆయన చెప్పారు.

Also Read:ప్రేమ మీద నమ్మకం కలిగించావ్` సుశాంత్‌ గర్ల్‌ ఫ్రెండ్ ఎమోషనల్‌ పోస్ట్

ఈ వ్యవహారంపై సీబీఐ విచారణ జరిపించాలంటూ సుశాంత్ సన్నిహితురాలు రియా చక్రవర్తి కేంద్ర హోంమంత్రి అమిత్ షాను కోరిన నేపథ్యంలో దేశ్‌ముఖ్ స్పందించారు. కాగా సుశాంత్ కేసులో ఇప్పటికే 34 మంది వాంగ్మూలాన్ని పోలీసులు నమోదు చేశారు.

వీరిలో సుశాంత్ కుటుంబసభ్యులతో పాటు రియా చక్రవర్తి, సంజయ్ లీలా భన్సాలీ తదితరులు ఉన్నారు. అలాగే రాజ్‌పుత్ వ్యక్తిగత మానసిక వైద్యుడి వాంగ్మూలాన్ని సైతం పోలీసులు శుక్రవారం నమోదు చేశారు.

Also Read:సుశాంత్ మృతి తరువాత తొలిసారి.. మాజీ ప్రేయసి ఎమోషనల్‌ పోస్ట్

ఈ సందర్భంగా సుశాంత్ ఆత్మహత్యకు ముందు అతని ఆరోగ్య పరిస్థితి వంటివి ఆరా తీశారు. జూన్ 14న సుశాంత్ తన ఫ్లాట్‌లో ఆత్మహత్య చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆయన మరణంపై సీబీఐ విచారణ జరిపించాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు.