క్రేజీ హీరోయిన్ నిత్యామీనన్ నటిస్తున్న తాజా చిత్రం మిషన్ మంగళ్. నిత్యామీనన్ కేవలం తన నటనతోనే ఇంతటి క్రేజ్ సొంతం చేసుకుంది. అద్భుతంగా హావభావాలు పలికించగల నటి అని ప్రశంసలు కూడా దక్కించుకుంది. ఇక నిత్యామీనన్ తన కెరీర్ లో ఎప్పుడూ గ్లామర్ రోల్స్ చేయలేదు. హద్దులు దాటి అందాల ఆరబోత చేయలేదు. 

జగన్ శక్తి దర్శకత్వం వహిస్తున్న మిషన్ మంగళ్ చిత్రంలో నిత్యామీనన్ కీలక పాత్రలో నటిస్తోంది. సోనాక్షి సిన్హా, తాప్సి, విద్యాబాలన్ కూడా ఈ చిత్రంలో నటిస్తున్నారు. భారీ అంచనాల నడుమ ఈ చిత్రం ఆగష్టు 15న విడుదలకు సిద్ధం అవుతోంది. దీనితో నిత్యామీనన్ ప్రచార కార్యక్రమాల్లో బిజీగా గడుపుతోంది. 

ఈ చిత్ర ప్రమోషన్స్ లో భాగంగా నిత్యామీనన్ కొన్ని ఫోటోలు సోషల్ మీడియాలో షేర్ చేసింది. రెడ్ టాప్, బ్లూ జీన్స్ లో ఉన్న నిత్యమీనన్ గ్లామర్ లుక్ లో అదరగొడుతోంది. ఈ ఫోటోలపై నెటిజన్లువిమర్శలు కురిపిస్తున్నారు. ఓ వైపు సొంత రాష్ట్రం కేరళలో వరదలు పోటెత్తుతున్నాయి. అంతా జలమయం కావడంతో జనాలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కొన్ని ప్రాంతాల్లో కొందరు ప్రాణాలు కూడా కోల్పోయారు. ఇలాంటి సమయంలో ఫోటో షూట్స్, సినిమా ప్రమోషన్స్ తో ఎంజాయ్ చేస్తున్నావు అంటూ విరుచుకుపడుతున్నారు. 

దీనిపై నిత్యామీనన్ ఘాటుగా స్పందించింది. బుద్ధిలేని వాళ్ళు మాత్రమే అలా మాట్లాడుతారు అని ఘాటుగా బదులిచ్చింది. సినిమా ప్రారంభం అయ్యాక ఆ చిత్ర ప్రచార కార్యక్రమాల్లో కూడా పాల్గొనడం నావిధి. ప్రస్తుత పరిస్థితి గురించి నాకు తెలుసు. మేమంతా కలసి వరద బాధితుల్ని ఆదుకునేందుకు ఓ నిర్ణయానికి వచ్చాం. దీని గురించి మీకు తెలియదు. సినిమా ప్రమోషన్స్ లో సంతోషంగా గడుపుతోంది అని తప్పుగా అనుకుంటున్నారు. అది సరైనది కాదు అని నిత్యా మీనన్ తెలిపింది.