సక్సెస్ ఫుల్ పర్సన్ కంటే ఫ్యామిలీ పర్సన్ చాలా సంతోషంగా ఉంటాడని యాంకర్ రవి ఒక కొటేషన్ ఇచ్చి తన ఫ్యామిలీ ఫోటోని షేర్ చేశాడు. తన భార్య, మూడేళ్ల కూతురి ఫోటోలని రివీల్ చేశాడు. ఇంతకాలం పాటు దాచిన నిజాల్ని సోషల్ మీడియా వేదికగా బయటపెట్టాడు రవి. 

అయితే ఈ పోస్ట్ పై కొందరు పాజిటివ్ కామెంట్స్ చేస్తుంటే.. మరికొందరు మాత్రం రవిని పట్టుకొని బూతులు తిడుతున్నారు. తెలుగులో ఎన్ని రకాల బూతులుంటాయో అవన్నీ రవిపై ప్రయోగిస్తున్నారు. ఇంత నెగెటివిటీ రావడానికి ఓ కారణముంది.

అప్పట్లో రవితో పాటు యాంకర్ లాస్య కూడా ఈవెంట్లను హోస్ట్ చేసేది. వీరిద్దరి మధ్య ఎఫైర్ సాగుతుందంటూ పుకార్లు కూడా వచ్చాయి. లాస్య ఎప్పుడైతే మరోవ్యక్తిని పెళ్లి చేసుకొని వెళ్లిపోయిందో.. అందరూ ఆమెను మోసగత్తె అంటూ కామెంట్లు చేసేవారు. దీంతో లాస్య పలు ఇంటర్వ్యూల్లో పాల్గొని రవికి పెళ్లైందని చెప్పింది.

కానీ రవి మాత్రం ఓ ఇంటర్వ్యూలో తనకు పెళ్లి కాలేదని అన్నాడు. అంతేకాదు.. ఇంటర్వ్యూ చేసిన యాంకర్ తో 'నాకు పెళ్లి కాలేదని నిరూపిస్తే మీరు పెళ్లి చేసుకుంటారా..?' అని మాట్లాడాడు. దీంతో రవికి నిజంగానే పెళ్లి కాలేదని అందరూ లాస్యని తిట్టుకున్నారు. కానీ ఇప్పుడు రవి విషయం తెలుసుకొని అతడిపై విరుచుకుపడుతున్నారు. 

భార్యా, కూతురిని పరిచయం చేసిన యాంకర్ రవి!

యాంకర్ రవి భార్య, కూతురిని చూశారా..?