Asianet News TeluguAsianet News Telugu

అన‌సూయ‌ ట్వీట్ పై...ఓ రేంజిలో నెటిజ‌న్లు ఫైర్

ప్రముఖ యాంకర్,నటి అనసూయ  గతంలోనూ అనేక వివాదాస్ప ట్వీట్స్ చేసి, జనాల చేత కామెంట్స్ చేయించుకుంది. అయితే ఇప్పుడు మరో అడుగు వేసి కరోనా తో తీవ్రమైన విషాదంలో ఉన్న పరిస్దితిలో వెటకారం కామెంట్స్ చేసింది. 

Netizens counter to Anasuya tweet
Author
Hyderabad, First Published Mar 23, 2020, 11:17 AM IST

 
సెలబ్రెటీ స్దాయిలో ఉన్నవాళ్లను చాలా మంది సామాన్యులు ఫాలో అవుతూంటారు. ముఖ్యంగా సోషల్ మీడియాలో ఈ ఫాలోయింగ్ మరీ ఎక్కువ. దాంతో వాళ్లు ప్రతీ విషయంలోనూ ఆచి,తూచి మాట్లాడాల్సిన పరిస్దితి. నోరు జారి కామెంట్ చేస్తే ఆ తర్వాత రకరకాల కామెంట్స్ ఎదుర్కోవాల్సి వస్తుంది. ఇప్పుడు ప్రముఖ యాంకర్,నటి అనసూయ పరిస్దితి ఇదే. ఆమె గతంలోనూ అనేక వివాదాస్ప ట్వీట్స్ చేసి, జనాల చేత కామెంట్స్ చేయించుకుంది. అయితే ఇప్పుడు మరో అడుగు వేసి కరోనా తో తీవ్రమైన విషాదంలో ఉన్న పరిస్దితిలో వెటకారం కామెంట్స్ చేసింది. 

అదేమిటంటే...తాజాగా తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్ ప్రెస్ మీట్లో తీసుకున్న నిర్ణ‌యాల‌పై స్పందించింది. ఈ నెల 31 వ‌ర‌కు రాష్ట్ర‌మంతా లాకౌట్ అని.. ర‌వాణా స‌హా అన్ని బంద్ అవుతాయ‌ని కేసీఆర్ ప్ర‌క‌టించిన సంగ‌తి తెలిసిందే. ఇదే విష‌యాన్ని ట్విట్ట‌ర్లో మంత్రి కేటీఆర్ వెల్ల‌డించాడు. దీనికి అంద‌రూ స‌హ‌క‌రించాల‌ని కోరాడు. ఈ ట్వీట్‌పై అన‌సూయ స్పందించింది.

ఆ ట్వీట్ లో తాను ప్ర‌భుత్వ నిర్ణ‌యాన్ని స‌మ‌ర్థిస్తాను.. అంగీక‌రిస్తాను అంటూనే.. ఇలా వారం పాటు అన్నీ ఆపేస్తే త‌న‌లా రోజు వారీ ప‌నుల‌కు వెళ్లే వాళ్ల ప‌రిస్థితి ఏంట‌ని ప్ర‌శ్నించింది. తాము ప‌నుల‌కు వెళ్ల‌కుంటే ఇంటి అద్దె, ప‌వ‌ర్ బిల్లులు, ఈఎంఐలు, ఇత‌ర ఖ‌ర్చులు ఎలా భ‌రించాల‌ని ప్రశ్నించింది. దాంతో ఈ ట్వీట్ ఆమె ఏ ఉద్దేశ్యంతో ట్వీటినా...జనాలు మాత్రం ఓ రేంజిలో ఫైర్ అవుతున్నారు.

అనసూయ..ఇదే ప్రశ్ను.. సామాన్యుల త‌ర‌ఫున వ‌కాల్తా పుచ్చుకుని వాళ్ల ప‌రిస్థితి ఏంట‌ని అడిగితే అందరూ మ‌ద్ద‌తిచ్చే వాళ్లం కానీ.... కానీ  నా లాంటి వాళ్ల‌కు నెల వారీ ఖ‌ర్చుల‌కు ఇబ్బంది అన్న‌ట్లుగా ఆమె మాట్లాడ‌టంతో నెటిజ‌న్లు ఆమెను గ‌ట్టిగా నిల‌దీస్తున్నారు. ఆమెని కామెడీలు చేస్తున్నారు. అయితే తాను త‌న‌తో పాటు అంద‌రి స‌మ‌స్య‌ను లేవ‌నెత్తానంటూ అన‌సూయ వివ‌ర‌ణ ఇచ్చుకునే ప్ర‌య‌త్నం చేసినా నెటిజ‌న్లు ఆగ‌ట్లేదు.

Follow Us:
Download App:
  • android
  • ios