లైంగిక ఆరోపణలు ఎదుర్కొంటున్న దర్శకుడు అనురాగ్ కశ్యప్ పై రేప్ కేసు నమోదు అయ్యింది. నటి పిర్యాదు మేరకు అనురాగ్ పై పోలీసులు రేప్ చేశారంటూ ఎఫ్ ఐ ఆర్ నమోదు చేయడం జరిగింది. మానభంగం, వేధింపులు, దుష్ప్రవర్తన, నిర్బంధించడం వంటి పలు సెక్షన్స్ క్రింద అనురాగ్ పై పోలీసులు కేసులు నమోదు చేశారు. ఈ కేసు విచారణలో అనురాగ్ పాల్గొనాల్సి వుంది. రేప్ ఆరోపణనలు అనురాగ్ కశ్యప్ ఖండించడం జరిగింది. అలాగే అనురాగ్ మాజీ భార్యలు కల్కి, ఆర్తి మరియు అనేక మంది బాలీవుడ్ ప్రముఖులు ఈ విషయంలో అనురాగ్ కి మద్దతు తెలిపారు. 

బాలీవుడ్ నటి  2013లో అనురాగ్ తనపై లైంగిక దాడికి పాల్పడినట్లు కేసుపెట్టారు.ముంబై యారి రోడ్ లోని వర్సోవా ప్రాంతంలో తనపై అనురాగ్ కశ్యప్ లైంగిక దాడికి పాల్పడడంతో పాటు, అసభ్యంగా ప్రవర్తించారని ఆ హీరోయిన్  కేసుపెట్టారట. ఆమె లాయర్  మిస్టర్ సాత్ పుతే ఈ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా తెలియజేశారు.  

కేవలం  ఆరోపణలతో ముగుస్తుందనుకున్న ఈ వివాదం మరింత పెద్దది అయ్యేలా కనిపిస్తుంది. అనురాగ్ పై రేప్ కేసు కూడా ఫైల్ కాగా ఈ వివాదం ఎక్కడికి వెళుతుందో అర్థం కావడం లేదు. ఒక విధంగా అనురాగ్ ఈ కేసులో పూర్తిగా ఇరుకున్నారు అనిపిస్తుంది. తగు సాక్ష్యాధారాలతో ఆయన నిర్దోషి అని బయటపడని నేపథ్యంలో అరెస్ట్ కూడా జరిగే అవకాశం కలదు. మొత్తంగా బాలీవుడ్ లో అనురాగ్ లైంగిక ఆరోపణల కేసు ఎఫ్ ఐ ఆర్ నమోదుతో కీలక మలుపు తిరిగినట్లు అయ్యింది.