Asianet News TeluguAsianet News Telugu

అప్‌కమింగ్‌ సింగర్‌ బాలుకి..సూపర్‌ స్టార్‌ ఎమ్జీఆర్‌ వెయిటింగ్‌ సర్‌ప్రైజ్‌

ఓ చిన్న గాయకుడి కోసం షూటింగ్‌లను ఆపేయడం జరగడమేది కష్టం. కానీ బాలు విషయంలో అది సాధ్యమైంది. 

mgr was wating three weeks for sp balasubramaniam to sing a song
Author
Hyderabad, First Published Sep 26, 2020, 8:32 AM IST

ఓ అప్‌కమింగ్‌ గాయకుడి కోసం ఓ సూపర్‌ స్టార్‌ వెయిట్‌ చేయడమనేది జరుగుతుందా? అస్సలు సాధ్యం కాదు, ఒకరు కాకపోతే మరొకరు, డేట్స్ వేస్ట్ కాకూడదని, ఓ చిన్న గాయకుడి కోసం షూటింగ్‌లను ఆపేయడం జరగడమేది కష్టం. కానీ బాలు విషయంలో అది సాధ్యమైంది. తమిళ సూపర్‌ స్టార్‌ ఎమ్జీఆర్‌..బాలు కోసం ఎంజీఆర్‌ వెయిట్‌ చేశాడు. ఒక్క రోజు కాదు, రెండు రోజులు కాదు మూడు వారాలు వెయిట్‌ చేశాడు. 

మరి ఆ కథేంటనేది ఓ సారి తెలుసుకుంటే, అది 1969 సంవత్సరం. బాలు అప్పుడప్పుడే సింగర్‌గా ఎదుగుతున్నాడు. గొప్ప పేరేమి లేదు. అడపాదడపా పాడుతున్నారు. మంచి పేరేమాత్రం తెచ్చుకున్నారు. ఈ విషయంలో అప్పటి సూపర్‌ స్టార్‌ ఎమ్జీఆర్‌కి తెలిసింది. ఆయన ఆ టైమ్‌లో `అడమైప్పెణ్‌` చిత్రంలో నటిస్తున్నారు. జయలలిత హీరోయిన్‌. 

ఆ చిత్రంలో ఓ పాటని బాలుతో పాడించాలని ఎమ్జీఆర్‌ నిర్ణయించుకున్నారు. బాలు టాలెంట్‌ విని ఆ సినిమాకి సంగీతం అందిస్తున్న కేవీ మహదేవన్‌తో మాట్లాడి బాలుని `ఆయిరం నిలవేనా` అనే పాటని పాడించాలని నిర్ణయించారు. చెన్నై రామవరంలోని ఎమ్జీఆర్‌ గార్డెనస్ లో బాలు, సుశీలతో పాట రిహార్సల్స జరిగాయి. పదిహేను రోజుల్లో పాట రికార్డింగ్‌ ఉంటుందన్నారు. తనకు వచ్చిన పెద్ద అవకాశం కావడం, పైగా ఎమ్జీఆర్‌ వంటి సూపర్‌ స్టార్‌ సినిమాకి కావడంతో బాలు ఆనందానికి అవదుల్లేవని చెప్పొచ్చు. 

అయితే ఆ సమయంలోనే బాలుకి టైఫాయిడ్‌ జ్వరం వచ్చింది. లేవలేని పరిస్థితి. ఓ వైపు బాలు పాడాల్సిన పాట షూటింగ్‌కి ఏర్పాట్లు జరుగుతున్నాయి. జైపూర్‌లో షూటింగ్‌ వెళ్ళాల్సి ఉందని మేనేజర్‌ బాలు వద్దకి వచ్చారు. ఆయన పరిస్థితి చూసి రెస్ట్ తీసుకోమని చెప్పి వెళ్లిపోయారు. ఇక ఆ పాట పాడే అవకాశం పోయిందని బాలు బాధపడ్డారు. మొత్తానికి జ్వరం నుంచి కోలుకున్నారు. ఊహించిన విధంగా మళ్లీ ప్రొడక్షన్‌ మేనేజర్‌ వచ్చాడు. బాలు ఆరోగ్యం మెరుగవడం చూసి `రేపు రిహార్సల్స్‌కు రాగలరా?` అని అడిగాడు. 

దీంతో బాలులో కొత్త ఉత్సాహం. తనకు ఊహించని పిలుపు ఎమ్జీఆర్‌ నుంచి రావడంతో ఆనందంతో ఉబ్బితబ్బిబ్బయ్యారు. ఎమ్జీఆర్‌ ఆఫీసుకు వెళ్లగానే.. అంతకుముందు పాడాల్సిన పాటనే ఆయనతో మళ్లీ రిహార్సల్స్‌ చేయించారు మహదేవన్‌. తనతో వేరే పాట పాడిస్తారని బాలు భావించారు. కానీ  ఆ పాటనే పాడించడం మరింత సర్‌ప్రైజ్‌ చేసింది. ఆ నెక్ట్స్ డే ఎమ్జీఆర్‌ను కలిశారు. 

ఈ సందర్భంగా ఎమ్జీఆర్‌ మాట్లాడుతూ, `ఈ పాటని మరో సింగర్‌తో పాడించి షూటింగ్‌ పూర్తి చేయగలను. కానీ నువ్వు ఈ సినిమాలో పాడుతున్నావని అందరికి తెలిసింది. నువ్వు కూడా చాలా మంది చెప్పుకుని ఉంటావు. ఇలాంటి పరిస్థితుల్లో నేను మరో గాయకుడితో పాట పాడిస్తే, నీ పాట నచ్చక అలా చేశానని అందరూ అనుకొంటారు. అది నీ భవిష్యత్‌కు మంచిది కాదు. అందుకే అన్నీ ఆలోచించి, మూడు వారాలు నీ కోసం ఎదురుచూశాను. జ్వరం తగ్గిన తర్వాతే నీతో పాడించాను` అని బాలుకి చెప్పారు ఎమ్జీఆర్‌. 

బాలుకి ఓ సూపర్‌స్టార్‌ నుంచి దక్కిన ప్రోత్సహానికి ప్రతిబింబం ఇది. ఇలా ఎవరైనా కొత్తటాలెంట్‌ని ఎంకరేజ్‌ చేస్తే ఎస్పీ బాలు లాంటి గాయకులు పుట్టుకొస్తారని స్ఫూర్తిని రగిల్చిన సందర్భమిది. 

Follow Us:
Download App:
  • android
  • ios