చివరిదాకా నేనుంటాను తారక్.. మంచు మనోజ్ ట్వీట్!

https://static.asianetnews.com/images/authors/74ce1d03-f84b-5b8e-abc1-c43c5f7c8632.jpg
First Published 31, Aug 2018, 3:09 PM IST
manchu manoj emotional tweet on ntr
Highlights

నందమూరి హరికృష్ణ బుధవారం తెల్లవారుజామున రోడ్డు యాక్సిడెంట్ లో ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. ఆయన అకాల మరణంతో సినీ ఇండస్ట్రీ విషాదంలో మునిగిపోయింది

నందమూరి హరికృష్ణ బుధవారం తెల్లవారుజామున రోడ్డు యాక్సిడెంట్ లో ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. ఆయన అకాల మరణంతో సినీ ఇండస్ట్రీ విషాదంలో మునిగిపోయింది. సినీ, రాజకీయ ప్రముఖులు హరికృష్ణ మృతికి నివాళులు అర్పించారు. గురువారం మధ్యాహ్నం ఆయన అంత్యక్రియలు నిర్వహించారు. ఆ సమయంలో కళ్యాణ్ రామ్, ఎన్టీఆర్ లు విలపించినతీరు ప్రతి ఒక్కరినీ భావోద్వేగానికి గురి చేసింది.

అభిమానులు తారక్ కు ధైర్యం చెబుతూ ట్వీట్లు చేస్తున్నారు. హీరో మంచు మనోజ్.. ఎన్టీఆర్ ని ఉద్దేశిస్తూ ఓ ట్వీట్ చేశాడు. ''తారక్, కళ్యాణ్ రామ్ అన్నని, వారి కుటుంబాన్ని అలా చూస్తుంటే గుండెపగిలిపోతుంది. దేవుడు నిజంగా కఠినాత్ముడు. హరికృష్ణగారి మృతి నుండి ఆ కుటుంబం తేరుకునేలా వారికి ధైర్యాన్ని ఇవ్వాలని ఆ దేవుడ్ని ప్రార్ధిస్తున్నాను. చివరిదాకా ఆ కుటుంబం కోసం నేనుంటాను.

తన పుట్టినరోజు కోసం ఖర్చు పెట్టే డబ్బును కేరళ వరద బాధితుల కోసం సహాయం చేయాలని చెప్పిన హరికృష్ణ గారి చివరి కోరికను మనం నెరవేరుద్దాం. నా వంతుగా రూ.5 లక్షల సాయం చేశాను. నందమూరి, తెలుగు సినిమా ఇండస్ట్రీ అభిమానులు కూడా తమ వంతు సాయం చేస్తరయ్ ఆశిస్తున్నాను'' అంటూ వెల్లడించారు.  

ఇవి కూడా చదవండి.. 

తారక్ అన్న.. నీ గురించే ఆలోచిస్తున్నాం: విజయ్ దేవరకొండ ట్వీట్!

కొడుకు కోరిక తీరకుండానే అనంతలోకాలకు వెళ్లిపోయారు!

నాన్న మమ్మల్ని అలా పెంచలేదు.. తండ్రి గొప్పదనాన్ని వివరించిన ఎన్టీఆర్!

ఎన్టీఆర్ విలపిస్తున్న తీరు ప్రతిఒక్కరినీ కంటతడి పెట్టిస్తోంది!

loader