తారక్ అన్న.. నీ గురించే ఆలోచిస్తున్నాం: విజయ్ దేవరకొండ ట్వీట్!

https://static.asianetnews.com/images/authors/74ce1d03-f84b-5b8e-abc1-c43c5f7c8632.jpg
First Published 29, Aug 2018, 4:44 PM IST
vijay devarakonda emotional tweet on ntr
Highlights

నందమూరి హరికృష్ణ బుధవారం తెల్లవారుజామున రోడ్డు ప్రమాదంలో మరణించిన సంగతి తెలిసిందే. సినీ, రాజకీయ ప్రముఖులు ఆయన మృతిపట్ల సంతాపం తెలియజేస్తున్నారు

నందమూరి హరికృష్ణ బుధవారం తెల్లవారుజామున రోడ్డు ప్రమాదంలో మరణించిన సంగతి తెలిసిందే. సినీ, రాజకీయ ప్రముఖులు ఆయన మృతిపట్ల సంతాపం తెలియజేస్తున్నారు. హైదరాబాద్ కి చేరుకున్న ఆయన మృతదేహాన్ని సందర్శించడానికి ప్రముఖులు తరలివస్తున్నారు. ఇప్పటికే రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, మినిష్టర్లు హరికృష్ణ నివాసానికి చేరుకొని ఆయన భౌతికకాయానికి నివాళులు అర్పిస్తున్నారు.

ఇక మరికొందరు సోషల్ మీడియా వేదికగా హరికృష్ణ మరణంపై సంతాపం ప్రకటిస్తున్నారు. తాజాగా విజయ్ దేవరకొండ హరికృష్ణకి నివాళులు అర్పిస్తూ ఎన్టీఆర్ ని ఉద్దేశిస్తూ ఓ ట్వీట్ చేశారు. 'తారక్ అన్న, నందమూరి కుటుంబం.. మేము మీ గురించే ఆలోచిస్తున్నాం. మీకు ఈ సంఘటనను ఎదుర్కొన్న ధైర్యం రావాలని కోరుకుంటున్నాను' అంటూ రాసుకొచ్చారు.

ఈ ట్వీట్ పై కొందరు నెటిజన్లు స్పందిస్తూ 'ఎన్ని ఇబ్బందులు వచ్చినా మీకు మేమున్నాం అన్నా..' అంటూ తారక్ పై అభిమానాన్ని చాటుతున్నారు.  

ఇవి కూడా చదవండి.. 

తాతయ్య అడిగిందే తడవు 990 కిమీలు నడిపారు: హరికృష్ణపై కల్యాణ్ రామ్

ఆ వార్త విని గుండె పగిలింది.. హరికృష్ణ మృతిపై తమన్నా!

కొడుకు కోరిక తీరకుండానే అనంతలోకాలకు వెళ్లిపోయారు!

loader