నందమూరి హరికృష్ణ మరణవార్త సినీ ఇండస్ట్రీని షాక్ కి గురి చేసింది. నార్కట్ పల్లి, అద్దంకి హైవేపై రోడ్డు ప్రమాదంలో హరికృష్ణ తీవ్రంగా గాయపడి, మృత్యువాత పడిన సంగతి తెలిసిందే.
నందమూరి హరికృష్ణ మరణవార్త సినీ ఇండస్ట్రీని షాక్ కి గురి చేసింది. నార్కట్ పల్లి, అద్దంకి హైవేపై రోడ్డు ప్రమాదంలో హరికృష్ణ తీవ్రంగా గాయపడి, మృత్యువాత పడిన సంగతి తెలిసిందే. తండ్రి మరణవార్త తెలిసిన హుటాహుటిన ఆసుపత్రికి చేరుకున్న ఆయన కొడుకులు కళ్యాణ్ రామ్, జూనియర్ ఎన్టీఆర్ లు హరికృష్ణ మృతదేహాన్ని చూసి తట్టుకోలేకపోయారు. బోరున విలపించారు.
ఎన్టీఆర్ కి తన తండ్రితో ప్రత్యేకమైన అనుబంధం ఉంది. ఇద్దరు కొడుకులు కూడా తండ్రిని ప్రాణంగా చూసుకుంటారు. ఆడియో ఫంక్షన్స్ కి ఆయన్ను వెంట తీసుకొచ్చేప్పుడు ఎంతో జాగ్రత్తగా నడిపిస్తుంటారు. హరికృష్ణ పెద్ద కుమారుడు జానకిరామ్ ని పోగొట్టుకొని విలపిస్తున్న సమయంలో మీకు మేమున్నాం నాన్న అంటూ హరికృష్ణకి ఎంతో ధైర్యాన్నిచ్చిన ఈ ఇద్దరు అన్నదమ్ములు తమ తండ్రిని పోగొట్టుకొని విలపిస్తున్న తీరు ప్రతి ఒక్కరినీ కంటతడి పెట్టేలా చేస్తుంది.
ఎన్టీఆర్ కుర్చీలో కూర్చొని రోదిస్తుండగా, అతడిని నారా లోకేష్ సముదాయిస్తున్న ఫోటోలు ఇప్పుడు బయటకి వచ్చాయి. ఎన్టీఆర్ ఏడుస్తున్న ఈ ఫోటోలు చూసిన అభిమానులు మరింత భావోద్వేగానికి గురవుతున్నారు. తమ జీవితాల్లో ముఖ్యమైన వ్యక్తిని పోగొట్టుకొని బాధపడుతున్న అన్నదమ్ములు త్వరలోనే కోలుకోవాలని కోరుకుందాం!
ఇవి కూడా చదవండి..
అన్న మరణంతో బాలయ్య కన్నీరుమున్నీరు!
