శృంగార తారగా ముద్ర వేసుకున్న మల్లికా శెరావత్ ఎక్కువగా గ్లామర్ రోల్స్ కె పరిమితం అయింది. ఆమె నటించిన మర్డర్, హిస్ లాంటి చిత్రాల్లో బోల్డ్ రోల్స్ తో సంచలనం సృష్టించింది. దశావతారం చిత్రంలో కీలక పాత్రలో నటించింది. మల్లికా శెరావత్ అందాలు ఒలకబోసి చిత్రాలు ఇంకా చాలానే ఉన్నాయి. 

ఇదిలా ఉండగా మల్లికా ఇటీవల ఓ ఇంటర్వ్యూలో తన రిలేషన్ షిప్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. తాను ప్రస్తుతం సింగిల్ గా హ్యాపీగానే ఉన్నానని తెలిపింది. కానీ త్వరలో ప్రేమలోపడి కొత్త రిలేషన్ ప్రారంభించాలని ఉన్నట్లు మల్లికా తెలిపింది. 

పిల్లలు కనడం గురించి ప్రశ్నించగా.. నాకు పిల్లలు లేరు. నా మేనల్లుడే నాకు బేబీ. వాడితోనే నేను ఆదుకునేది. ప్రేమ, రిలేషన్ వరకు ఓకే.. కానీ తల్లిని కావడం మాత్రం నాకు ఇష్టం లేదు. ఎందుకంటే మాతృత్వం అనేది చాలా పెద్ద భాద్యత. అలాంటి భాద్యతలు నాకు వద్దు. పిల్లలు ఉంటే ఎప్పుడూ వాళ్ళ గురించే ఆలోచించాలి, సమయం కేటాయించాలి. కానీ  ప్రస్తుతం నేను ఇలాగే హ్యాపీగా ఉన్నా అని మల్లికా తెలిపింది. 

మల్లికా శెరావత్ కు 2000 సంవత్సరంలోనే కరణ్ సింగ్ అనే వ్యక్తిని వివాహం చేసుకుంది. ఏడాదికే అతడి నుంచి విడిపోయింది. ఇటీవల మల్లికా ఫ్రాన్స్ కు చెందిన సిరిల్ అనే వ్యాపారవేత్తతో డేటింగ్ చేసింది. అతడి నుంచి కూడా విడిపోయిన మల్లికా ప్రస్తుతం సింగిల్ గా ఉంటోంది.