Asianet News TeluguAsianet News Telugu

ఫిల్మ్ ఇండస్ట్రీలో తీవ్ర విషాదం, విగ‌త జీవిగా యంగ్ స్టార్, షాక్ లో చిత్ర ప్రముఖులు

వరుస మరణాలతో చిత్ర పరిశ్రమ ఉక్కిరిబిక్కిరి అవుతోంది. ఈ ఏడాది వరుసగా సినీ ప్రముఖులు ఈలోకాని విడిచి వెళ్ళిపోతున్నారు. అందులో యంగ్ స్టార్స్ కూడా ఉండటం.. తీవ్ర విషాదాన్ని నింపుతోంది. ఇక రీసెంట్ గా మరో యంగ్ స్టార్ మరణం సినీ ప్రముఖులను షాక్ కు గురిచేసింది. 

Malayalam Young Star Sarath Chandran Passes Away
Author
Hyderabad, First Published Jul 31, 2022, 8:30 AM IST

వరుస మరణాలతో చిత్ర పరిశ్రమ ఉక్కిరిబిక్కిరి అవుతోంది. ఈ ఏడాది వరుసగా సినీ ప్రముఖులు ఈలోకాని విడిచి వెళ్ళిపోతున్నారు. అందులో యంగ్ స్టార్స్ కూడా ఉండటం.. తీవ్ర విషాదాన్ని నింపుతోంది. ఇక రీసెంట్ గా మరో యంగ్ స్టార్ మరణం సినీ ప్రముఖులను షాక్ కు గురిచేసింది. 

సినీపరిశ్ర‌మ‌లో మ‌రో విషాదం చోటు చేసుకుంది. మ‌ల‌యాళ న‌టుడు శ‌ర‌త్ చంద్ర‌న్ 37 వయస్సులో తుది స్వాస విడిచారు. అనుమానాస్పద పరిస్థితుల్లో శరత్ చంద్రన్  కొచ్చిలోని త‌న నివాసంలో విగ‌త జీవిగా క‌నిపించాడు. శరత్  మ‌ర‌ణంతో  మ‌ల‌యాళ ఇండ‌స్ట్రీ తీవ్ర దిగ్భ్రాంతి వ్య‌క్తం చేస్తుంది. ప్ర‌ముఖ‌ మ‌ల‌యాళ న‌టుడు ఆంటోని వ‌ర్గీస్ సోష‌ల్ మీడియా ద్వారా శ‌ర‌త్ మృతి గురంచి వెల్లడించారు. శరత్ మరణం  ప‌ట్ల దిగ్భ్రాంతి వ్య‌క్తం చేశాడు.

శ‌ర‌త్ సినిమాల్లోకి రాక‌ముందు ఐటీ సంస్థ‌లో ఉద్యోగం చేసేవాడు. చిన్నతనం నుంచి  సినిమాల‌పై ఉన్న ఆస‌క్తితో జాబ్‌ను వ‌దిలేసి సినిమా అవ‌కాశాలకోసం తిరగడం మొదలు పెట్టాడు. కష్టపడి చిన్న స్థాయి నుంచి యంగ్ స్టార్ గా ఎదిగాడు. కెరీర్ బిగినింగ్ లో  డ‌బ్బింగ్ ఆర్టిస్టుగా లైఫ్ స్టార్ట్ చేసిన శరత్ ... అలా డబ్బింగ్ ఆర్టిస్టుగా కెరీర్‌ను ప్రారంభించి అనిస్య సినిమాతో న‌టుడిగా మారాడు. ఆ తరువాత‌ అంగ‌మ‌ళై డైరీస్‌, ఒరు మెక్సిక‌న్ అప‌ర‌త‌, కూడే వంటి సినిమాలతో మలయాళ పరిశ్రమలో మంచి నటుడిగా పేరు తెచ్చుకున్నాడు. 

శరత్ చంద్రన్.. ఒరు మెక్సికన్, సీఐఏ కామ్రేడ్ ఇన్ అమెరికా లాంటి సినిమాలు శరత్ కు మంచి  గుర్తింపు వచ్చేలా చేశాయి.  . లిజో జోస్ పెల్లిస్సేరి యాక్షన్ డ్రామా సినిమా అంగమలీ డైరీస్‌లో శరత్ కీలక పాత్ర పోషించాడు. ఇక శరత్ మరణం పట్ట మలయాల ఇండస్ట్రీ ప్రముఖులు దిగ్బ్రాంతి వ్యాక్తం చేస్తున్నారు. ఇంత చిన్న వయస్సులో ఎంతో భవిష్యత్తు ఉన్న నటుడు ఇలా అకస్మాత్తుగా మరణంచడంతో బాధను వ్యాక్తం చేస్తున్నారు. 

Follow Us:
Download App:
  • android
  • ios