బాలీవుడ్ హీరో అర్జున్ కపూర్.. సీనియర్ హీరోయిన్ మలైకా అరోరాతో ప్రేమాయణం సాగిస్తున్నాడని వార్తలు వస్తోన్న సంగతి తెలిసిందే. మలైకా తన పెళ్లి తరువాత అర్జున్ తో ఎఫైర్ నడిపించిందని ఇల్లీగల్ గా ఉండే వీళ్ల రిలేషన్ ను మలైకా తన భర్తకి విడాకులిచ్చి ఇప్పుడు అఫీషియల్ గా అర్జున్ ని పెళ్లి చేసుకోబోతుందంటూ వార్తలు వస్తున్నాయి.

ఈ మధ్య కాలంలో ఇద్దరూ కలిసి తిరగడం, విదేశాల్లో చక్కర్లు కొట్టడం చూస్తుంటే వీరి మధ్య రిలేషన్ నిజమని అనిపిస్తుంది. ఇటీవల ఈ జంట ముంబైలో ఖరీదైన ఇంటికి కూడా తీసుకున్నారని సమాచారం.

ఇప్పుడు మలైకా తమ బంధాన్ని ఓ లాకెట్ ద్వారా చెప్పే ప్రయత్నం చేసింది. తమ మెడలోని చైన్ కి ఉన్న లాకెట్ ఫోటోని షేర్ చేసింది. దాని మీద 'ఏఎం' అని ఉంది. ఏ అంటే అర్జున్ కపూర్, ఎం అంటే మలైకా అరోరా అనేది ఈ ఫోటో సందేశమని స్పష్టమవుతోంది. గతంలో కూడా కొందరు సెలబ్రిటీలు తమ ప్రేమలను ఇలా వ్యక్తపరిచారు.

ఇప్పుడు మలైకా ఈ లాకెట్ షేర్ చేసిన అఫీషియల్ గా తమ ప్రేమ బంధాన్ని ఒప్పుకున్నట్లేనా..? అర్జున్ కంటే మలైకా పదేళ్లు పెద్దది. పైగా ఆమెకి ఓ కొడుకు కూడా ఉన్నాడు. అందుకే వీరి రిలేషన్ బాలీవుడ్ లో మరింత హాట్ టాపిక్ గా మారింది. 

ఇవి కూడా చదవండి.. 

కుర్రహీరోతో పెళ్లిపై సీనియర్ నటి కామెంట్!

నేనున్నా కదా.. సీనియర్ నటికి కుర్ర హీరో భరోసా!

ఏ భర్త ఇలా చేసి ఉండడు.. విడాకులపై అర్భాజ్ ఖాన్ కామెంట్స్!

నువ్వు కుర్రాడితో తిరిగితే..నేను కుర్రపిల్లను లైన్లో పెట్టా

విడాకులు తీసుకున్న నటితో కుర్రహీరో పెళ్లి..?

విడాకుల హీరోయిన్ ప్రేమలో యంగ్ హీరో..?