బాలీవుడ్ హీరోయిన్ మలైకా అరోరా.. ఐటెం గర్ల్ గా కెరీర్ మొదలుపెట్టి ఆ తరువాత నటిగా మారింది. బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ తమ్ముడిని పెళ్లి చేసుకొని ఇద్దరు పిల్లలకు తల్లయింది. అయితే కొన్నాళ్ల క్రితం ఆమె తన భర్త అర్భాజ్ ఖాన్ కి విడాకులిచ్చి దూరమైంది. 45 ఏళ్ల వయసులోనూ తన గ్లామర్ షోతో దూసుకుపోతుంది. తన విడాకుల అనంతరం బాలీవుడ్ కుర్ర హీరో అర్జున్ కపూర్ తో ఆమె ప్రేమాయణం సాగిస్తుందనే వార్తలు వినిపించాయి.

ఈ కారణంగానే సల్మాన్ ఓ ఫంక్షన్ లో బోణీకపూర్ ని ప్రేమగా దగ్గర తీసుకొని అర్జున్ కపూర్ ని కావాలంటే ఎవైడ్ చేశారని టాక్. బోణీకపూర్ కూడా తన కొడుకు పెళ్ళైన అమ్మాయితో డేటింగ్ చేస్తున్నాడని బాధ పడుతున్నాడట. తాజాగా మలైకా అరోరా, అర్జున్ కపూర్ కలిసి ఓ ఫ్యాషన్ షోలో పక్కపక్కనే కూర్చొని షోని ఎంజాయ్ చేస్తూ కనిపించడంతో మరోసారి ఈ ప్రచారం ఎక్కువైంది.

ఈ ఫ్యాషన్ షోకి అర్జున్ కపూర్ తన చెల్లెల్లు జాన్వీ, ఖుషీ కపూర్ లను వెంటబెట్టుకొని వచ్చారు. అందరూ స్నేహపూర్వక వాతావరంలోనే ఉన్నారనే అభిప్రాయలు వ్యక్తమవుతున్నప్పటికీ గతం నుండి మలైకా, అర్జున్ ల ప్రేమ వ్యవహారం ప్రచారం ఉండడంతో వీరిద్దరూ కలిసి ఉన్న ఫోటోలు ఇప్పుడు వైరల్ గా మారాయి.