బాలీవుడ్ లో మలైకా అరోరా, అర్జున్ కపూర్ ల ప్రేమ వ్యవహారం హాట్ టాపిక్ గా మారిన సంగతి తెలిసిందే. పెళ్లై విడాకులు తీసుకోవడంతో పాటు తనకంటే 15 ఏళ్లు చిన్నవాడైన అర్జున్ కపూర్ తో చెట్టాపట్టాలు వేసుకొని తిరుగుతుంది మలైకా.. త్వరలోనే ఈ జంట పెళ్లి చేసుకోబోతుందనే వార్తలు షికారు చేస్తున్నాయి.

ఇటీవల కాఫీ విత్ కరణ్ షోలో కరణ్ జోహార్ కూడా ఈ విషయంపై హింట్స్ ఇచ్చాడు. తాజా సమాచారం ప్రకారం 2019 ఏప్రిల్ లో ఈ జంట పెళ్లి చేసుకోబోతుందనే ప్రచారం జోరుగా సాగుతోంది. ఈ విషయంపై ఇప్పటివరకు మలైకా, అర్జున్ కపూర్ లు స్పందించకపోవడంతో ఈ పుకార్లకి బ్రేక్ పడడం లేదు.

ఎట్టకేలకు మలైకా పెళ్లి వార్తలపై స్పందించింది. తనకు ఈ విషయంపై మాట్లాడడం అసౌకర్యంగా ఉంటుందని చెబుతూనే తన పెళ్లిపై క్లారిటీ ఇచ్చింది. ''ప్రస్తుతం నేను సంతోషంగా ఉన్నాను. నన్ను ఇలా ఉండనివ్వండి. వ్యక్తిగత జీవితంపై ప్రశ్నలకు నేనెప్పుడూ సమాధానం ఇవ్వలేను.

ఇలాంటి వాటి గురించి మాట్లాడాలంటే సిగ్గుగా ఉంటుంది. అసౌకర్యంగాను అనిపిస్తుంది. నా జీవితం ఏంటో నేను చెప్పాల్సిన అవసరం లేకుండా అందరికీ తెలుసు కదా'' అంటూ వెల్లడించింది. 

ఇవి కూడా చదవండి.. 

నేనున్నా కదా.. సీనియర్ నటికి కుర్ర హీరో భరోసా!

ఏ భర్త ఇలా చేసి ఉండడు.. విడాకులపై అర్భాజ్ ఖాన్ కామెంట్స్!

నువ్వు కుర్రాడితో తిరిగితే..నేను కుర్రపిల్లను లైన్లో పెట్టా

విడాకులు తీసుకున్న నటితో కుర్రహీరో పెళ్లి..?

విడాకుల హీరోయిన్ ప్రేమలో యంగ్ హీరో..?