బాలీవుడ్ లో ఇప్పుడు హాట్ టాపిక్ ఏమిటీ అంటే అర్బాజ్ ఖాన్ లేటెస్ట్ ప్రేమాయణం. ఆయన 19 ఏళ్లు కాపురం చేసిన భార్య మలైకా అరోరా కు విడాకులు ఇచ్చారు. ఆమె కూడా ఉత్సాహంగా తన ప్రియుడు అర్జున్ కపూర్ తో చెట్టాపట్టాలు వేసుకుతిరుగుతోంది. ఇద్దరూ త్వరలో పెళ్లి కూడా చేసుకోబోతున్నట్లు సమాచారం. తన భార్య తన కన్నా వయస్సులో చాలా చిన్న కుర్రాడుతో చెట్టాపట్టాలు వేసుకుని తిరగటం అర్భాజ్ ఖాన్ కు మండినట్లుంది. 

దాంతో అర్బాజ్ కూడా ... ఇటాలియన్ మోడల్ అయిన జార్జియా ఆండ్రియానీ అనే కొత్త అమ్మాయితో చెట్టాపట్టాలేసుకు తిరగటం మొదలెట్టాడు. తన కన్నా చాలా చిన్నది అయిన ఆమెతో తిరగటం చూసి బాలీవుడ్ ముక్కున వేలేసుకుంది. కానీ మలైకా పై ఉన్న కోపంతోనే ఇలా చేస్తున్నాడని కొందరంటున్నారు. ఆమెను త్వరలోనే వివాహం కూడా చేసుకోబోతున్నట్లు చెప్తున్నారు. 

రీసెంట్ గా తన కొడుకు అర్హాన్‌ని కూడా ఆమెకు పరిచయం చేశాడీయన. అప్పటి నుంచి అర్బాజ్ ఫ్యామిలీ ఈవెంట్లలో  జార్జియా అప్పుడప్పుడు తళుక్కుమని మెరుస్తోంది. ఈ విషయం ఎంతమందికి తెలిస్తే అంత మంచిదన్నట్లు బిహేవ్ చేస్తున్నాడు అర్బాజ్. అంతెందుకు తన మాజీ భార్య, నటి మలైకా అరోరా సోదరి అమృతను అర్బాజ్ ఈ మధ్య కలిసినప్పుడు..జార్జియా అతని వెంటే ఉంది.

  రీసెంట్ గా సల్మాన్ చెల్లెలు  అర్పిత నిర్వహించిన గణేష్ పూజలో అర్బాజ్ - జార్జియా ఆండ్రియాని ఇద్దరూ జంటగా పాల్గొని మీడియాకు ఫోజులిచ్చారు.  అర్బాజ్ కొడుకు  కూడా అక్కడే ఉండడం విశేషం. అంతేకాకుండా  అర్బాజ్ ఖాన్ జార్జియా ఆండ్రియాని తో కలిసి నవరాత్రి వేడుకలను గుజరాత్ లో జరుపుకున్నారు. ఆ సమయంలో  జార్జియా తో కలిసి ఉన్న ఒక ఫోటో ను ఇన్స్టాగ్రామ్ ఖాతా ద్వారా పోస్ట్ చేశాడు.  


అయితే ఇక్కడ మరో ట్విస్ట్ ఏమిటి అంటే..అర్భాజ్ ఖఆన్, తన మాజీ భార్య  మలైకా అరోరా ని..అప్పుడప్పుడు విందులలో, కుటుంబ శుభకార్యాల్లో కలుసుకుంటున్నారు. మలైకాతో విడిపోయిన మొదట్లో ఇంకో మహిళతో కూడా అర్బాజ్‌ ప్రేమాయణం మొదలెట్టాడు. కానీ అది ఎంతో దూరం వెళ్లలేదు. దాంతో  ఇప్పుడు జార్జియాతో కలిసి మెలిసి తిరుగుతున్నాడు అర్బాజ్‌. మరి వీళ్ల కథ ఎలాంటి మలుపులు తిరిగి క్లైమాక్స్ చేరుతుందో చూడాలి.